చిగురాకులు మొలచిన నీ కళ్ళు
ఎగిరిపోతాయి సీతాకోకచిలుకలై
నా ముందు నుంచి: ఎవరు ఆపగలరీ గాలినీ
కురవబోయే వాననీ,మన నీడలు
ముడుచుకునే సాయంకాలాలనీ?
చూడూ
నల్లటి మట్టితో వేచే పాదులు ఈ అరచేతులు-
ఇంకా, మరి కొంతసేపు ఆగితే
మొక్కను వెదుక్కుంటూ సాగే
ఒక వేరు మొలుస్తుంది ఇక్కడ-
మరి చూసావా నువ్వు
ఒళ్లంతా వేర్లు మొలిచి, నేలకై వెదుక్కునే
ఒక దారీ తెన్నూ లేని
మనిషిని ఎన్నడైనా-?
ఎగిరిపోతాయి సీతాకోకచిలుకలై
నా ముందు నుంచి: ఎవరు ఆపగలరీ గాలినీ
కురవబోయే వాననీ,మన నీడలు
ముడుచుకునే సాయంకాలాలనీ?
చూడూ
నల్లటి మట్టితో వేచే పాదులు ఈ అరచేతులు-
ఇంకా, మరి కొంతసేపు ఆగితే
మొక్కను వెదుక్కుంటూ సాగే
ఒక వేరు మొలుస్తుంది ఇక్కడ-
మరి చూసావా నువ్వు
ఒళ్లంతా వేర్లు మొలిచి, నేలకై వెదుక్కునే
ఒక దారీ తెన్నూ లేని
మనిషిని ఎన్నడైనా-?
No comments:
Post a Comment