- రాత్రిలోకి తొంగి చూస్తే, నక్షత్రాలకు పూసిన
ఓ చందమామ కనిపిస్తుందని
వచ్చావా, ఇక్కడికి-?
మరి,చూడు ఇక్కడ
వొంగిన తల తెగి, ఎవరి కన్నీళ్ళలోనో రాలిపడితే
చివరికి
నెత్తురంటిన, నువ్వు అంటిన,నువ్వు అంటుకున్న
ఆ చేతులేవరివో తెలియదు,లోతు అందని
బావులయ్యింది ఎవరో తెలియదు
చివరికి
మిగిలింది, వెళ్లిపోయింది కూడా ఎవరో తెలియదు -
ఇక మళ్ళా వస్తావా,ఎపుడైనా ఇటువైపు
ఆత్మహత్యించుకుని
తిరిగి జన్మించే ఈ
శ్వేత నలుపు రాత్రుళ్ళ కనుల వైపు?
నేరాపరాధన లేని, మోపని
ఈ ప్రేమల వైపూ?
ఓ చందమామ కనిపిస్తుందని
వచ్చావా, ఇక్కడికి-?
మరి,చూడు ఇక్కడ
వొంగిన తల తెగి, ఎవరి కన్నీళ్ళలోనో రాలిపడితే
చివరికి
నెత్తురంటిన, నువ్వు అంటిన,నువ్వు అంటుకున్న
ఆ చేతులేవరివో తెలియదు,లోతు అందని
బావులయ్యింది ఎవరో తెలియదు
చివరికి
మిగిలింది, వెళ్లిపోయింది కూడా ఎవరో తెలియదు -
ఇక మళ్ళా వస్తావా,ఎపుడైనా ఇటువైపు
ఆత్మహత్యించుకుని
తిరిగి జన్మించే ఈ
శ్వేత నలుపు రాత్రుళ్ళ కనుల వైపు?
నేరాపరాధన లేని, మోపని
ఈ ప్రేమల వైపూ?
No comments:
Post a Comment