(You:Break the disc.Is it an order? Order
Of the world?Know
I'll never know -
You)
నెలవంక అంచున, నీ మొనన ఒక నెత్తురు చుక్క - అప్పుడు
Of the world?Know
I'll never know -
You)
నెలవంక అంచున, నీ మొనన ఒక నెత్తురు చుక్క - అప్పుడు
నీ బాహువుల్లో దాగిన తోడేలు నీలి పూల వాసన వేస్తుంది. రాత్రంతా మ్రోగే ఊళలలో నీ నామం. నీ నామ స్మ/రణం. ఎడతెరిపిగా కోరుకున్న మ/రణం రెండు శరీరాల సరిహద్దుల వద్ధ దాకా వచ్చి ఆగినట్టు అదొక నీలి విన్యాసం. నిప్పు- మరి పూల గుత్తుల వల వేలాడే ఆకాశంలో, జూకాల కిందుగా జారే వెన్నెల వానలో నదిలో చ్చీకటి మొప్పల కాంతి చేపలని వేటాడే భల్లూకం: నువ్వు ఆడుకునే ఒక మొసలీ మరి నువ్వు ప్రార్ధించే దైవం కూడానూ: తెలియదు నీకు ఈ అంగాల మధ్య ఇన్నేళ్ళుగా ఎన్ని ఆలయాలో, ఈ దంతాల కింద దాగిన ఎన్ని ఆక్రందనలో: కానీ
Kill the parrot (Open your mouth)
Break the disc (Write your word-)
And then, and
then, you open your legs and say - hey:
Hallelujah,I say
Hey, hallelujah
ఇక్కడంతా, విత్తనాన్ని చీల్చుకుని, మట్టిని దొలుచుకుని వొస్తున్న చిగురాకు సవ్వడి - చిగురాకుపై మంచు చేరుకునే సవ్వడి- మంచుని తాకి తొలి కిరణం కరిగిపోతున్న సవ్వడి-కిరణం వృత్తమై ఏ నీటి వాగుల్లోనో ప్రతిబింబించే సవ్వడీ: వెనువెంటనే పెదాలను వీడిన ఒక వేణువు ఆగిన ఒక నిశ్శబ్ధమూ- మరి మ్మరి మ్మరీ మ్రుమ్మారు
Shall we kiss and Love now and not Forever? And never?
(ఏమంటావ్ నువ్వు, గుహలు లేని, అరణ్యాలు లేని తోడేళ్ళతో, ఈ రాత్రి కొండ చరియలతో, చిలువులతో?)
No comments:
Post a Comment