రాత్రిలో, తన నుదిటి కుంకుమ
దీపమై వెలుగుతుందని
ఆశించావు; చేతులెంతో చాచి -
బహుశా, నీ ఇంటి ముంగిట నిల్చి
ఎంతో ఆర్తితో, నిన్నెంతో
అర్ధించిన బిక్షకుడ్ని మరిచావు -
పిలుపులు వలయాలై, నీళ్ళయ్యీ
లోన, ప్రతిధ్వనిస్తాయి;
గొంతెత్తి అరిచే బుజ్జాయి అలాగే
ఆకులు రాలిన నేలపై, నీడలతో
'అమ్మా' అనో, 'అంబా'
అనో, వొణికి రగిలే ఆర్తనాదమై ...
***
చీకటి, ఎవరిదో ఒక్క మాటా రాక
నుదుటన దిగే మేకైతే,
శిరస్సున ఒక ముళ్ళ కిరీటమైతే,
ఏమీ చెప్పకు! అసలేమీ చెప్పకు
శ్రీ! నెత్తురు గులాబీలతో
తిరిగే, అందమైన మరీచికలకు!
No comments:
Post a Comment