అమ్మ ఇంటికి వచ్చింది. వస్తూ
ఏవేవో తెచ్చింది. తన
చుట్టూ మూగిన పిల్లలు ఒకటే
హడావిడి: తేనె పిట్టలై -
ఎప్పటికో రాత్రి అయ్యింది. తన
హృదయం ఇక, ఒక
మైదానమయ్యింది. చెట్ల కింద
వెన్నెల్లో, చినుకుల్లో
ఏవేవో చప్పుళ్ళు. పాల వాసన -
చొంగతో నిదురలో ఊగే
పూలు: మంచులో సెలయేళ్ళు.
ఏవేవో కలవరింతలు -
***
అమ్మ ఇంటికి వచ్చింది. వచ్చి
అందరినీ బజ్జో పెట్టింది -
ఆ గూటిలో నువ్వూ నిదురోక
ఇట్లా, వ్రాసుకోవడమెందుకు?
ఏవేవో తెచ్చింది. తన
చుట్టూ మూగిన పిల్లలు ఒకటే
హడావిడి: తేనె పిట్టలై -
ఎప్పటికో రాత్రి అయ్యింది. తన
హృదయం ఇక, ఒక
మైదానమయ్యింది. చెట్ల కింద
వెన్నెల్లో, చినుకుల్లో
ఏవేవో చప్పుళ్ళు. పాల వాసన -
చొంగతో నిదురలో ఊగే
పూలు: మంచులో సెలయేళ్ళు.
ఏవేవో కలవరింతలు -
***
అమ్మ ఇంటికి వచ్చింది. వచ్చి
అందరినీ బజ్జో పెట్టింది -
ఆ గూటిలో నువ్వూ నిదురోక
ఇట్లా, వ్రాసుకోవడమెందుకు?
No comments:
Post a Comment