10 December 2016

ఒకసారి

నిద్రపోయి ఉంది తను: బయట
ఆడుకుంటూ పిల్లలు -

శీతాకాలపు గాలి. ఎక్కడినుంచో 
పావురాళ్లు రెక్కలు 
విదుల్చుకునే చప్పుడు. ఎండా -
రెపరెపలాడే దుస్తులు 
బాల్కనీలో: కుండీలపై నీడలు -
వెరసి ఒక మధ్యాహ్నం
నిద్రపోయి ఉంది తాను, అలసి -
ఇక, తన కలల తోటలో
మునివేళ్ళ మీద తిరుగాడుతూ 
ఇద్దరు పిల్లలూ, ఓ కవీ 

మరి అతనీదే అయిన ఓ చిన్ని 
చిన్ని పొయెమ్! 

1 comment:

  1. తన కలల తోటలో
    మునివేళ్ళ మీద తిరుగాడుతూ
    ఇద్దరు పిల్లలూ, ఓ కవీ :) wonderful

    ReplyDelete