అనుకోకుండా
నువ్వు
ఇక్కడ
రాత్రిలో ఒక నిప్పు కణికెను రాజేసి వదిలినప్పుడు
తడబడి ఒక దీపం ఎక్కడో
ఒక పూవై రాలి
ఒలికిపోతుంది ~
అనుకోకుండా
అప్పుడు
ఒక చిన్న గాలి
గూళ్ళలో సద్దుమణిగిన చీకటి - సన్నటి ఇష్టం.
ఇక ఎవరో ఎక్కడో
నీలా నవ్వీ నవ్వీ
కుదురుకుని
వెళ్ళిపోతే
ఇక్కడ
ఈ నేత్ర సరస్సులో చెదిరిన నీటి వలయాలు
ఎప్పటికో తిరిగి - తమలో తాము
సంస్థాపితమై నిద్రిస్తాయి. ఆనక
నిన్నే అవి మరి
కలగంటాయి
కలవరిస్తాయి ~
అనుకోకుండా
నువ్వు
చీకట్లో - రాత్రి నుంచి పగటికి దారి అడిగిననాడు
ఇంటికి చేరవలసిన, ఇల్లు లేని
ఒక బాటసారి
దారి మరచిపోతాడు. ఆ మరపులో
నిన్నూ
ఒక దారినీ దీపాన్నీ - ఒక రాత్రినీ పగటినీ - అంతిమంగా
అనుకోకుండా
తనని తానూ
కనుగొంటాడు ~
నువ్వు
ఇక్కడ
రాత్రిలో ఒక నిప్పు కణికెను రాజేసి వదిలినప్పుడు
తడబడి ఒక దీపం ఎక్కడో
ఒక పూవై రాలి
ఒలికిపోతుంది ~
అనుకోకుండా
అప్పుడు
ఒక చిన్న గాలి
గూళ్ళలో సద్దుమణిగిన చీకటి - సన్నటి ఇష్టం.
ఇక ఎవరో ఎక్కడో
నీలా నవ్వీ నవ్వీ
కుదురుకుని
వెళ్ళిపోతే
ఇక్కడ
ఈ నేత్ర సరస్సులో చెదిరిన నీటి వలయాలు
ఎప్పటికో తిరిగి - తమలో తాము
సంస్థాపితమై నిద్రిస్తాయి. ఆనక
నిన్నే అవి మరి
కలగంటాయి
కలవరిస్తాయి ~
అనుకోకుండా
నువ్వు
చీకట్లో - రాత్రి నుంచి పగటికి దారి అడిగిననాడు
ఇంటికి చేరవలసిన, ఇల్లు లేని
ఒక బాటసారి
దారి మరచిపోతాడు. ఆ మరపులో
నిన్నూ
ఒక దారినీ దీపాన్నీ - ఒక రాత్రినీ పగటినీ - అంతిమంగా
అనుకోకుండా
తనని తానూ
కనుగొంటాడు ~
No comments:
Post a Comment