రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక, విలవిలలాడుతూ మూల్గుతూ, వర్షపు రాత్రి గాలి నా చుట్టూతా –
రాత్రంతా
ఊగిసలాడుతూ గోడలపై నీడలు. తడచిన లతలు.
ఎక్కడో వాన వెలిసిన నీళ్ళు బొట్టుబొట్టుగా రాలుతూ చేసే హృదయ విదారక శబ్ధం.
బాల్కనీలో రాలిన ఆకులకుపైగా, సగం
ఒరిగిన గూటిలోంచి వెలికి వచ్చిన
లేత పక్షి రెక్క ఒకటి, తడచి
ముద్దయ్యి –
(ఎవరు చెప్పగలరు మరి
అది బ్రతికి ఉందో, లేదో?)
రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక, విలవిలలాడుతూ తన కనుల అంచుల నుంచి
ఒలికిన చుక్కలు
విరిగీ ఆవిరయ్యీ, తన
చేతులు రెండూ, రెండు అలసిన కాడలై నాలోకి ఒరిగిపోతే
అంతటా ఒక నిశ్శబ్ధం. అంతటా ఒక నిస్సహాయత. అంతటా
ఒక హృదయ కంపన. దీపం పగిలిన వాసన. అంతటా
పదునైన చీకటి చెమ్మ ~
రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఏడుస్తూ ఉంది తను
ఇక రాత్రంతా - నాలోనూ, మూసుకున్న
తన కళ్ళలోనూ, తనకు పైగా
విసురుగా తిరిగే పంకా కిందుగా, ఏ క్షణాన తెగుతుందో తెలియని సీతాకోక ఒకటి
బయట పడే దారి తెలియక విలవిలలాడుతో, అక్కడక్కడే
విసురుగా తిరిగే పంకా కిందుగా, ఏ క్షణాన తెగుతుందో తెలియని సీతాకోక ఒకటి
బయట పడే దారి తెలియక విలవిలలాడుతో, అక్కడక్కడే
ఎగురుతో కొట్టుకులాడుతో, ఒక్కత్తే
తపిస్తో ~
No comments:
Post a Comment