ఇంకొంతసేపే-
మరింతసేపు ఉండమని నిన్ను అడగను.
తెలుసు నాకు
ఎవరూ దీపం వెలిగించలేదనీ, నీ హృదయం
ఎవరినో తలచుకుని వణుకుతుందనీ
నీ ముఖం బరువై, నీ అరచేతులలోకే
కూరుకుపోయే సమయం ఆసన్నమయ్యిందనీ
రమ్మని ఎవరూ నిన్ను పిలవరనీ, తమ
చేతుల్లోకి ఎవరూ నిన్ను, పొదుపుకోరనీ
ఒక తీవ్రమైన చలి రాత్రి వేచి చూసీ చూసీ
నీలో నువ్వు గడ్డ కట్టుకుపోతావనీ, కరిగిపోతావనీ
నెలలు నిండుతున్న గర్భంతో, పుట్టబోయే
పాపకి ఎంతో ఇష్టంతో అల్లుకున్న- సగంలో
ఆగిపోయిన- స్వెట్టర్లా అలా మిగిలిపోతావనీ...
తెలుసు నాకు.
అయినా, ఇంకా కొంతసేపే.
మరింతసేపు ఉండమని నిన్ను అడగను.
కొద్దిగా ఆగు -
వెళ్లిపోదాము మనము, ఇంత అన్నం తిని
నీ దారిలో - నేను.
నా దారిలో నువ్వూ.
మరింతసేపు ఉండమని నిన్ను అడగను.
తెలుసు నాకు
ఎవరూ దీపం వెలిగించలేదనీ, నీ హృదయం
ఎవరినో తలచుకుని వణుకుతుందనీ
నీ ముఖం బరువై, నీ అరచేతులలోకే
కూరుకుపోయే సమయం ఆసన్నమయ్యిందనీ
రమ్మని ఎవరూ నిన్ను పిలవరనీ, తమ
చేతుల్లోకి ఎవరూ నిన్ను, పొదుపుకోరనీ
ఒక తీవ్రమైన చలి రాత్రి వేచి చూసీ చూసీ
నీలో నువ్వు గడ్డ కట్టుకుపోతావనీ, కరిగిపోతావనీ
నెలలు నిండుతున్న గర్భంతో, పుట్టబోయే
పాపకి ఎంతో ఇష్టంతో అల్లుకున్న- సగంలో
ఆగిపోయిన- స్వెట్టర్లా అలా మిగిలిపోతావనీ...
తెలుసు నాకు.
అయినా, ఇంకా కొంతసేపే.
మరింతసేపు ఉండమని నిన్ను అడగను.
కొద్దిగా ఆగు -
వెళ్లిపోదాము మనము, ఇంత అన్నం తిని
నీ దారిలో - నేను.
నా దారిలో నువ్వూ.
No comments:
Post a Comment