"రాయడం ముఖ్యమా? రాయకపోవడం అంతకన్నా ముఖ్యమా?" అని అడిగాడు అతను-
తను ఏమీ మాట్లాడలేదు. ఒక సాయం సంధ్యవేళ
మసక చీకటి, పరదాలవలే జాలువారుతున్నవేళ
ఎదురుగా సైకిళ్ళపై వేగంగా వెళ్ళిపోతూ పిల్లలు. బెల్లులు గణగణమంటూ -
అంత చలిలోనూ ఎవరో వాకిలిలో చల్లిన, కళ్ళాపి
వాసన. పచ్చిగడ్డి వీచినట్టూ, ఒక స్త్రీ లేచి పాకలో
దీపం వెలిగించినట్టూ, ఆ రాత్రిలో నీ కళ్ళల్లో ఇంత
ప్రాణం పోసినట్టూ, తేరుకుని నువ్వు, తొలిసారిగా
చూసినట్టూ - ఒక పదం, ఒక వాక్యం . ఒక విభ్రమం. ఆపై ఒక నిశ్శబ్ధం కూడా-
"రాయడం నిజంగా మరీ అంత ముఖ్యమా?" అతను మళ్ళా అడిగాడు, తనలో
తాను ఏదో గొణుక్కుంటూ, చీకట్లోంచి తలెత్తి
ఎవరూ కనిపించని చీకట్లోకే మళ్ళా చూస్తూ -
ఆ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు కానీ, ఇక అక్కడ
ఇంటికి వెళ్ళలేని ఒక పాపో, లేక దారి తప్పిన ఒక పిల్లవాడో, ఏడ్చీ ఏడ్చీ ఏడ్చీ
ఆఖరికి గుక్కపట్టి పెట్టే వెక్కిళ్ళు, ఆ రాత్రిలో
ఆకాశంలో మిణుకుమిణుకుమనే నక్షత్రాలై
ఆకుల నుంచి రాలే చినుకులో, అశ్రువులో
I
పో
యి
మిగిలీ, పిగిలీ
పొర్లి పొర్లి పొర్లి
పో
యీ
...

No comments:
Post a Comment