ఈ శీతాకాలపు మంచులోంచి, ఎండ పొర ఒకటి
రెక్కలు విప్పార్చి ఎగిరింది -
వినాలి నువ్వు దాని కూతని
ఒక పిల్లవాని అరచేతిని నీ అరచేతిలో పుచ్చుకుని -
అంతటా పూల తడి. అంతటా
ఒక మెత్తటి ఆకుపచ్చనితనం
అంతటా, రెప్పలు విప్పుతున్న నిద్ర వాసన ఏదో
నీ హృదయ ప్రాంగణంలో-
నీడలు లేని వెలుతురూ
గాలికి తడబడే ఆకులూ
ఇంకా, వెల్లకిల్లా పడి, నిర్జీవంగా రెప్పలు మూసుకుని
ఊదారంగు పావురమొకటి-
"నాన్నా ఏమయ్యింది?" అని
అర్థం కాక, ఆ పిల్లలు అడిగితే
వాళ్ళని గట్టిగా హత్తుకుని
-ఇలా- చెబుతాడు అతను:
"ఏమీ లేదు: ఎగరలేనప్పుడూ, చూడలేనప్పుడూ
రంగులేవీ మనల్ని తాకలేనప్పుడూ
మీ అమ్మనో, నేనో - రేపు మీరో ఇలా..."
ఇకా తరువాత, ఆ రాత్రి వేళకి కూడా, అతనేం చెప్పాడో
పిల్లలకీ అర్థం కాలేదు, అతనికీ
అర్థం కాలేదు. పూచిన చెమ్మకి
కనురెప్పలు రాలి, గొంతు పూడుకుపోయిన
తనకీ అర్థం కాలేదు-
అంతే. ఇంకేం లేదు.
రెక్కలు విప్పార్చి ఎగిరింది -
వినాలి నువ్వు దాని కూతని
ఒక పిల్లవాని అరచేతిని నీ అరచేతిలో పుచ్చుకుని -
అంతటా పూల తడి. అంతటా
ఒక మెత్తటి ఆకుపచ్చనితనం
అంతటా, రెప్పలు విప్పుతున్న నిద్ర వాసన ఏదో
నీ హృదయ ప్రాంగణంలో-
నీడలు లేని వెలుతురూ
గాలికి తడబడే ఆకులూ
ఇంకా, వెల్లకిల్లా పడి, నిర్జీవంగా రెప్పలు మూసుకుని
ఊదారంగు పావురమొకటి-
"నాన్నా ఏమయ్యింది?" అని
అర్థం కాక, ఆ పిల్లలు అడిగితే
వాళ్ళని గట్టిగా హత్తుకుని
-ఇలా- చెబుతాడు అతను:
"ఏమీ లేదు: ఎగరలేనప్పుడూ, చూడలేనప్పుడూ
రంగులేవీ మనల్ని తాకలేనప్పుడూ
మీ అమ్మనో, నేనో - రేపు మీరో ఇలా..."
ఇకా తరువాత, ఆ రాత్రి వేళకి కూడా, అతనేం చెప్పాడో
పిల్లలకీ అర్థం కాలేదు, అతనికీ
అర్థం కాలేదు. పూచిన చెమ్మకి
కనురెప్పలు రాలి, గొంతు పూడుకుపోయిన
తనకీ అర్థం కాలేదు-
అంతే. ఇంకేం లేదు.
No comments:
Post a Comment