ఉదయాన్నే నిద్ర లేచావు. అకారణంగా ఎందుకో సంతోషంగా ఉన్నావు -
దులిపి ఆరవేసిన పల్చని తెలుపు వస్త్రంలాంటి మంచు. మంచువంటి కాంతిలో
తడిచే చెట్లూ, ఆకులూ. నిదురించే పిల్లల వద్ద నుంచి వచ్చే
సుగంధమేదో గాలిలో. అప్పుడు కొద్దిగా, దీపస్థంబాల కింద
నీడల నిశ్శబ్ధం. మరికొద్దిగా రాలే చినుకులు చేసే అలజడీ-
సరిగ్గా అప్పుడు అంటుంది తను అతనితో -
"ఇంకా కొద్ది దూరమే. ఆగిపోకు అప్పుడే - సంతోషంగా ఉన్నందుకు
దిగులు చెందకు. కళ్ళ పక్కగా పెరుగుతున్న కణితులతో
ఆ పావురం పిల్లకు కళ్ళు కనపడవు.
మరి, తెలుసా నీకా విషయం?"
అతనికి తెలియదు కానీ, ఇక ఇప్పటికి
అతని అరచేతిలో, తన అరచేయి. తన అరచేతిలో ఒక పసివాని చేయీ-
ఎదురుగా కనుమరుగయ్యే మంచులో తడిచి
నింపాదిగా పుష్పించే, రెండు ఎర్రెర్రని దానిమ్మ పూవులు.

No comments:
Post a Comment