ఆకులు రాలుతూ, వణికించే గాలిలో, నీ చుట్టూ వ్యాపించే చీకటి-
చుక్కలేవో మెరుస్తాయి అప్పుడు ఆకాశంలో.
చెవులు రిక్కించి వింటావు, ఎవరైనా వచ్చి గేటు తీసే శబ్ధం వినపడుతుందేమోనని.
నీ శరీరం మొత్తం అప్రమత్తమై, ఒక ఆకస్మిక జలదరింపై
ఒక వాకిలై, ఎవరైనా వచ్చి కల్లాపి చల్లినట్టు, నీపై కురిస్తే
ఈ ఒక్క రాత్రి, బ్రతికిపోదామనే, ఒక ఊహ, ఒక
ఎదురుచూపు, ఒక ఆశ, ఒక స్వల్పమైన కోరిక-
నీ ఆత్మ మొత్తమూ, శరణు జొచ్చిన కనులై, ప్రార్ధనకు ముకుళించిన అరచేతులై
ఎండిపోయి రెండు చుక్కల నీళ్లకై విలవిలలాడే పెదాలై, ఎవరో వొదిలివేసిన వేణువులో
కొట్టుకులాడే గాలై, పరితపించీ పరితపించీ, చివరికి
ఆకులు రాలే వణికించే గాలిలో, ఆ ఒక్కరికై
రాత్రిలో చుట్టూ వ్యాపించే చీకట్లో ఒరిగిపోయి, భూమికి మోకరిల్లిన నుదురై
అలా నిలిచిపోయి-
ఏం లేదు.
నువ్వు లేవు, నువ్వు వొదిలిన నీడలు మాత్రం మిగిలి ఉన్నాయి ఇక్కడ.

No comments:
Post a Comment