"నిశ్శబ్ధం అనేది ఉందా అసలు?"
అని అతను, తనని తాను ప్రశ్నించుకున్నాడు-
ఎదురుగా గోడలపై, లతల వలే జారే వాన నీళ్ళు.
ఒక పసివాడి తలని నిమిరినట్టు
నిన్ను లాలనగా నిమిరే ఓ గాలి
నీడలు లేని ఒక కాంతి అప్పుడు నీలో: నీ ప్రాంగణంలో-
మౌనముద్రలో ఉన్న బుద్ధుని
ఛాయాచిత్రాన్నేదో నీకు జ్ఞప్తికి
తెచ్చే చెట్లూ, పూలూ, ఆకులూ-
అక్కడక్కడే ఎగిరి నీ పక్కగా వాలే ఒక తూనీగ: ఇక
ఎవరో నెమ్మదిగా నీ పక్కగా చేరి, నీలో
కుదురుకుని కూర్చున్నట్టు ఉండే
సాయంత్రంలో, సరిగా అప్పుడు కొంత కలకలం. సరిగ్గా
అప్పుడు కొంత, కదలిక లేని కదలిక-
కుండీలో పెట్టిన రెండు గుడ్లపై మళ్ళా
సర్దుకుని కూర్చునే ఒక పావురం
ఒక తల్లీ, పిల్లలూ, నక్షత్రాలూనూ-
ఇక అప్పుడు, సరిగ్గా అప్పుడు, వాటన్నిటినీ చూస్తూ కూడా
వాటన్నిటిలో నిమగ్నమయ్యి కూడా
"నిశ్శబ్ధం ఉందా అసలు?" అనతను
తనను తాను కానీ, తనలో మిగిలిన
ఆమెను కానీ, ఎలా ప్రశ్నించగలడు?

No comments:
Post a Comment