నీటిలోని కాంతిని తాకలేను
నీడలు ముసిరే వేళల్లో, బరువుగా ఒరిగిన నీ కనురెప్పల కింది
కనీళ్ళను చూడనూ లేను -
చీకటి చెట్ల కింద తల వంచుకుని
నువ్వలా, నేనిలా నుల్చుని...
మన అరచేతులు ఆనీ ఆనక
మన చేతివేళ్లు తాకీ తాకక
కలిసి ఉండాలేకా, విడిపోనూలేకా, ఏమీ
చెప్పుకోనూ లేక, చెప్పరాక
ఇక
లోపలంతా చెక్కుకుపోయి, తెగిపోయి, మౌనంగా
ఒకరి తలను మరొకరి గుండెకేసి
మోదుకునీ, బాదుకునీ, ఏడ్చీ...
చిన్నమ్మా
పగుళ్ళిచ్చి, హోరున కురిసిన ఆ రాత్రి
ఇంకా ఇప్పటికీ
ఇక్కడ తెల్లవారనే లేదు -
నీడలు ముసిరే వేళల్లో, బరువుగా ఒరిగిన నీ కనురెప్పల కింది
కనీళ్ళను చూడనూ లేను -
చీకటి చెట్ల కింద తల వంచుకుని
నువ్వలా, నేనిలా నుల్చుని...
మన అరచేతులు ఆనీ ఆనక
మన చేతివేళ్లు తాకీ తాకక
కలిసి ఉండాలేకా, విడిపోనూలేకా, ఏమీ
చెప్పుకోనూ లేక, చెప్పరాక
ఇక
లోపలంతా చెక్కుకుపోయి, తెగిపోయి, మౌనంగా
ఒకరి తలను మరొకరి గుండెకేసి
మోదుకునీ, బాదుకునీ, ఏడ్చీ...
చిన్నమ్మా
పగుళ్ళిచ్చి, హోరున కురిసిన ఆ రాత్రి
ఇంకా ఇప్పటికీ
ఇక్కడ తెల్లవారనే లేదు -
No comments:
Post a Comment