ఇదొక దాహం.
పూలను పంచి, ముళ్ళని త్రాగే దాహం
హృదయాన్ని ఇచ్చి, భిక్షాందేహీ అంటూ నీ ముంగిట నిలబడే దాహం-
నీ చుట్టూతా
పిచ్చుకలై ఎగిరే దాహం -
రిఫ్ఫ్ రిఫ్మనే ఆ రెక్కల కలకలంలో కలవరపెట్టే దాహం
సీతాకోకచిలుకలై నీ కనుల అంచుల్లో వాలి, నిన్నే చూస్తుండిపోయే దాహం
వానచినుకులై
నీలో ఇంకిపోయే దాహం
నీడలై నీపై తార్లాటలాడే దాహం. నీపైకి వొంగి
అప్పుడప్పుడూ నిన్ను లేత ఎండలానో, తుఫాను తీవ్రతతోనో తాకే దాహం
తీరం లేని దాహం
నన్ను గుప్పిళ్ళతో అందుకుని
రాత్రుళ్ళలోకో, రాత్రి మనుషులలోకో వెదజల్లే దాహం
నీలోకో, తనలోకో, పిల్లల నిదురలోకో, ముసిలివాళ్ళ అరచేతుల గీతల్లోకో
నన్ను త్రోసివేసే దాహం
ఇదంతా
ఒక సంరంభం. ఒక మొదలూ, ఒక అంతం.
ఒక జననం, మరొక మరణం. మరలా మరలా పునరుజ్జీవనం. మరలా మరలా
శిలువ వేయబడటం -
ఇదంతా
కొంత వొదిలి వేయబడటం
కొంత ఎదురుచూడబడటం. కొంత అలసిపోబడటం. కొంత విసిగిపోబడటం-
అంతిమంగా, ఆత్మ ఎండిపోయి
ఇట్లా, మట్టికుండలాంటి
నీకై- ఒక ఖాళీ గాజుపాత్రనై - గాలికి నేలపై దొర్లుతూ వేచి ఉండటం
నాలోపలి వ్రూమ్మంటో తిరిగే గాలిని
నేనే వినడం. నేనే కనడం
నాలోపల నేనే పొదిగి పొదిగి, దాహం అయ్యి తిరిగి దారి తప్పి పోవడం
మళ్ళా, మొదటి నుంచి మొదలు పెట్టడం
తిరిగి వలయమవ్వడం
కరిగిపోవడం
బిందువుగా
మారిపోవడం..
అవును
మరి నువ్వన్నది నిజంగా నిజం.
అరచేతులని అరచేతులు తాకలేనంత దూరంలో
ఎదురెదురుగా ఉండి కలవలేని ఒక నిర్ధయమైన కాలంలో, లోకంలో
కాంతి లేని ఈ సీమలో
I thirst.
Truly.
నిజంగా ఇదొక దాహం!

No comments:
Post a Comment