అట్లా అని పెద్దగా ఏమీ లేదు -
గోడల వెంబడ పాకి, చప్పున ఆగి సహనంగా చూసే ఒక బల్లి.
దాని కింద నేలపై, ఊగే నీడలు.
కొంత మట్టి తడచిన వాసన -
నీళ్ళు చిలుకరించినట్టు, గదులలోంచి మాటలు.
కుండీలో ఆకులు కొద్దిగా కదిలే శబ్ధం.
నిన్ననే పుట్టిన పావురపు పిల్లపై, ఆ
తల్లి పావురం సర్దుకుని కూర్చునట్టు
ఇది ఒక రాత్రి.
ఒక లేత మంట ఏదో అలుముకున్నట్టు
దాని రెక్కల కిందకు నేనే ఒదిగినట్టు
ఎవరో నన్ను పొదుగుతున్నట్టూ, నువ్వు హత్తుకున్నట్టూ
నీ ఛాతిలో దాగిన ముఖానికి నువ్వు ఏదో చెబుతున్నట్టూ
కనురెప్పలపై మునివేళ్ళతో రుద్ది
నులివెచ్చని కలల లోకాలలోకి
నీ శ్వాసతో ఊయలలూపి
తేలికగా వొదిలివేస్తున్నట్టూ-
ఇక
ఆ తరువాత ఏం ఉంటుంది?
అట్లా అని
అన్నీ ఉండాలనేం లేదు. నువ్వూ, నేనూ, ఒక గూడూ
పక్షి రెక్కల కింద పగలని గుడ్డూ
నీడల్లో మెరిసే కాంతీ, కరుణా
ఇంకా, నేను చెప్పలేనివి ఎన్నో-
మరి ఇది నిజం చిన్నా
గోడపై వాలిన తూనీగను చప్పున ఒక బల్లి నోట కరచుకోగా
కళ్ళు తెరవక, గూటిలోంచి రాలిపోయి
గిలగిలా కొట్టుకులాడుతుంది
పస్థుతానికి ఈ 'జీవితం'- ఇక
ఎవరైనా "ఎలా ఉన్నావూ?" అని హటాత్తుగా అడిగితే
"నేను బావున్నాను"
అని నువ్వో, నేనో ఎలా చెప్పడం?

No comments:
Post a Comment