ఎవరో చాలా చాలా కాలం క్రితం ఒక ప్రమిదెను వెలిగించారు: ఇక - అప్పుడు
ఈ విశ్వం మొదలయ్యింది.
నేను తన అరచేతిని అంది పుచ్చుకుని, తన వక్షోజాల నీడలో
తల దాచుకుని ఇలా అన్నాను:
నేను తన అరచేతిని అంది పుచ్చుకుని, తన వక్షోజాల నీడలో
తల దాచుకుని ఇలా అన్నాను:
"ఇక చాలు. ఇక నన్ను ఇంటికి తీసుకువెళ్ళు."
మరికొద్ది సమయం తరువాత అక్కడ మిగిలినదల్లా
ఒక ఒంటరి ఒంటరి విశ్వంలో
ఒక ఒంటరి ఒంటరి విశ్వంలో
ఒక వంటరి వంటరి మనిషి -
అప్పుడు తను అన్నది: "ఇక మిగిలినదీ, మిగలబోయేదీ ఇదే:
తన నీడలో తానే వడలిపోయి
తన నీడలో తానే వడలిపోయి
జాడను మిగిల్చే ఒక గులాబీ
సంకేతంగా మారిన, నువ్వు అనే
రెక్కలు లేని పక్షి గీతం మాత్రమే."
No comments:
Post a Comment