దయగా గమనించే, తెగిన చందమామ అయినా లేక
చీకట్లో ఒంటరిగా ఈ నగర రహదారులలో
వెదుకులాడుకుంటూ నడవటం అన్నది
ఈ జీవన మృత్యువులో మృత్యువై, నువ్వు అతనికి ఇచ్చిన బహుమతి -
దయగా తాకే ఓ స్త్రీ తెగిన స్పర్శ అయినా లేక
రాత్రుళ్ళలో ఒంటరిగా నిదురించడం అన్నది
ఈ జీవితపు శూన్యంలో శూన్యమై నువ్వు ప్రేమతో అతనికి ఇచ్చిన బహుమతి -
అయ్యల్లారా, అమ్మల్లారా, ఒక కవి తన కవితను రమిస్తూ ఉండటం, ఒక నర్తకిని
తన నృత్యంనుంచి వేరుగా చూడలేకపోవడం, పూవుని
దాని సౌందర్యాన్ని భద్రపరిచేందుకు తుంపడం
ఆనందానికై నిరంతరం గాయపడుతూ ఉండటం
అనేది, అయ్యల్లారా అమ్మల్లారా, ఇవన్నీ ఓ యాత్రికుడి మూర్ఖత్వపు అదృష్టం:
ఇవన్నీ అతడికి ఎంతగా అవసరమంటే
సాయంత్రపు పరిమళాన్ని తన గదిలో నింపిన మధువు నయనాలలో
తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, సుదూరపు సమయం అయిన
ఇప్పటి సమయంలో ఒక ఆత్మహత్యను ఊహించుకుంటూ, అతను
కళ్లపై అరచేతుల్ని గూళ్ళలా అమర్చుకుని
నెమ్మదిగా కనులు మూసుకుంటూ -ఇక-
ఈ దినానికి అతను ఒక శిశువు కలలో మరణించేందుకు సిద్ధపడతాడు -

Nice
ReplyDelete