అలసిపోయిన నీ అరచేతుల మధ్య ఇమిడిపోయిన నీ ముఖం
ఈ రాత్రికి నేను చూడలేని ఒక చందమామ.
అలసిపోయి, పగుళ్ళిచ్చిన ఆ గోడల వెనుక ఏమి జరుగుతుందో
అలసిపోయిన ఆ మేఘాల వెనుక
ఇన్ని సంవత్సరాలుగా నీ ముఖం
అలసిపోయిన ఆ మేఘాల వెనుక
ఇన్ని సంవత్సరాలుగా నీ ముఖం
ఏ ఏ యుద్ధాలని వీక్షించిందో - ఒక్క నీకు మాత్రమే తెలుసు: ఇక
ఎడబాటు ద్వారా మనల్నికలిపే దూరంలో
ఈ పదాలు, నీ నిశ్శబ్ధాన్ని తెలిపేందుకు
ఎడబాటు ద్వారా మనల్నికలిపే దూరంలో
ఈ పదాలు, నీ నిశ్శబ్ధాన్ని తెలిపేందుకు
ఎవరో వదిలివేసిన చిహ్నాలు.
రా . పిడచ కట్టుకుపోయిన నీ అరచేతుల్ని
నా అరచేతుల్లో కాసేపు వొదిలివేసి
రా . పిడచ కట్టుకుపోయిన నీ అరచేతుల్ని
నా అరచేతుల్లో కాసేపు వొదిలివేసి
మనతో ఈ వర్షాన్ని మాట్లాడనివ్వు కాసేపు.
హృదయాన్ని హత్తుకుంది సార్..
ReplyDelete