ఎవరూ రారు
వెన్నెల్లో, పూలల్లో
వెన్నెల పూలతో
ఎవరూ రారు
ఎదురు చూడకు
ఇక నీకు
చక్కగా నిదురించే కళను
అభ్యసించే తరుణం
వచ్చింది
లోపలికి వెళ్ళు
పచ్చటి ముల్లుతో
రక్తపు దారంతో
కనురెప్పలను
కుట్టుకో
ఎందుకంటే మరో పగలు
త్వరితంగా నీపైకి దూసుకు వచ్చే
సమయం ఆసన్నమయ్యింది
చాలా బాగుంది శ్రీకాంత్ గారు..
ReplyDelete