ఇంటికి వెడతానో లేదో
ఈ రాత్రికి
ఇంకా ఇక తెలీదు
ఆమె అరచేతుల మధ్య
ఒదిగిపోతానో
మధుపాత్రల
సూర్యరశ్మి చెలమలపై
గులాబీ రేకులతో
సాగిపోతానో
ఇక ఎప్పటికీ తెలీదు.
స్నేహితులు, శత్రువులూ
పిల్లలూ
గులాబీ రేకుల వంటి వారు:
అలా అని
అతడు ఇప్పుడే చెప్పాడు.
నువ్వు విన్నావా?
౨.
ఆమె వద్దకు వెడతానో లేదో
ఈ రాత్రికి
ఇంకా ఇక తెలీలేదు
ఎవరి వద్ద రోదిస్తానో, ఎవరి
ఒంటరి
హృదయంలో మరణిస్తానో
ఇప్పటికీ
ఇంకా తెలీలేదు.
ఎవరి మరణంలో జన్మనవుతానో
ఎవరి జీవితంలో
మరణం అవుతానో, ఎప్పటికీ
ఎవరికీ
ఏమీ కాకుండా పోతానో
ఇప్పటికీ
ఇంకా తెలిసేటట్టు లేదు.
ఆమె వద్దకు వెడతానో లేదో
ఆమె ఒంటరి
హృదయంలో దీపం అవుతానో లేదో
ఇప్పటికి ఇంకా
తెలియలేదు.
౩.
ఈ రాత్రికి
ఇంటికి వెడతానో లేదో
ఇంకా తెలీదు
పిల్లల కళ్ళు నడయాడే
పదాలలో
కొన్నిటినైనా ఎప్పటికైనా
దాచుకుంటానో
రాలిపోతున్న తల్లి తండ్రులను
ఎప్పటికైనా
ఓదార్చుకుంటానో
తెలీదు.
నిజంగా తెలీదు
ఈ రాత్రికి
ఇంటికి వెడతానో లేదో
ఇంకా తెలీదు .
''మనం లేకపోతే ప్రపంచానికేం నష్టం ...
ReplyDeleteమనం లేకపోవడం తప్ప'' అన్న కవి గుర్తొచ్చారు.
కవిత బావుంది.తెల్లారేసరికి మారిన నేపధ్యమూ బావుంది
ఎవరి వద్ద రోదిస్తానో, ఎవరి
ReplyDeleteఒంటరి
హృదయంలో మరణిస్తానో
ఇప్పటికీ
ఇంకా తెలీలేదు.
ఆమె వద్దకు వెడతానో లేదో
ఆమె ఒంటరి
హృదయంలో దీపం అవుతానో లేదో
ఇప్పటికి ఇంకా
తెలియలేదు.
good.
yes..chaalaabaagundi..
ReplyDeleteaa sandigdamlone undi life's charm....nice poem....love j
ReplyDeleteరాలిపోతున్న తల్లి తండ్రులను
ReplyDeleteఎప్పటికైనా
ఓదార్చుకుంటానో
బాగుంది!