25 December 2010

సగం అద్దం by m.s naidu (Remix version by Srikanth)

సగం అద్దం by m.s naidu (original version)

నా అద్దంలో
కొన్ని భూకంపాలు ఉన్నాయి.
ఏదీ విరిగిపడదు.
పగలదు.
ఒరగదు.

నా అద్దంలోంచి నీ అద్దంలోకి
చూస్తాను.
పగిలిపోతాను.

ఈ అద్దాల దూరం ఎంత.
దూరమైన అద్దాలతో ఎవరు చూస్తారు.

నీటి సాలీడొకటి అద్దం లోపల
లోపల కూర్చుని నా వంక చూడక
నీ అద్దం లోపలున్న పదాల కలలకై నిద్రిస్తోంది నిలబడి.

నేనొక అద్దమైతే
నాలుకతో ఎవర్ని వెక్కిరించాలి
కన్నీటి సూర్యుడినా?

(by permission by the writer)

సగం అద్దం by m.s naidu (Remix version by Srikanth

నా ఇంటిలో
కొన్ని భూకంపాలు ఉన్నాయి.
ఏదీ విరిగిపడదు.
పగలదు.
ఒరగదు.

నా ఇంటిలోంచి నీ ఇంటిలోకి
చూస్తాను.
పగిలిపోతాను.

ఈ ఇళ్ళ దూరం ఎంత.
దూరమైన ఇళ్ళతో ఎవరు చూస్తారు.

ఆమెలాంటి
నీటి సాలీడొకటి ఇంటి లోపల
కూర్చుని నా వంక చూడక
నీ ఇంటి లోపలున్న పదాల కలలకై నిద్రిస్తోంది నిలబడి.

నేనొక ఇంటినైతే
నాలుకతో ఎవర్ని వెక్కిరించాలి
సూర్యుడి కన్నీళ్ళనా ?

16 comments:

  1. సన్యాసి సన్యాసి "రాసుకుంటే" ఏమగును? ఇదిగో ఇటువంటి బూడిద కవిత్వం రాలును.

    ReplyDelete
  2. super
    please watch
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    ReplyDelete
  3. anonymous,
    i think this is going too far. comments, critical comments are always welcome, however harsh they may be: but comments, purely personnel with an insulting tone will do no good for neither the reader nor the writer. hope all the anonymous readers who are posting such comments will realize the spirit of my comment.

    ReplyDelete
  4. hi anonymous and srikant.
    it's nice that someone had read something. reader's world has changed. i am too young to react. i am not a polished reader like an anonymous. i am pitying myself for this.

    oh anonymous!
    give us knowledge.
    thank u.

    ReplyDelete
  5. అందుకని ఏమన్టారైతే ?మీరిద్దరూ రాస్తున్న పిచ్చి ప్రేలాపనల్కి మేము చప్పట్లు కోట్టాలా ? కవిత్వం బాగుందని చెప్పడం ఎలా మా బాధ్యతో, విమర్శిన్చడం మా హక్కు. మీకు నచ్చకపోతే comment Moderation పెట్టుకోండి...

    ReplyDelete
  6. anonymous

    mee jnaanam ki joohaarlu. meeru koddhigaa picchi ante emitho prelaapanalu ante emito vivaristhe baavundedhi. chesthaaru kadhu. (post scricp: "piccchi" ledhaa "prelaapanala"" baasha intha chakkagaa meeku arthamainandhuku kruthagnathalu) haakaa? evari haakandi? elaa define chesthaaru hakkuni? meeku meeru hakku ichessukunte saripothundhaa?

    ReplyDelete
  7. మహాకవులు, మహా విమర్శకులు అందరూ ఒకసారి హస్త ప్రయోగం చేసుకోవలె. కొద్దిగా రాయవలె. ఎంత మర్యాద పూర్వకమైన విమర్శ, ఎంత మర్యాద పూర్వకమైన కవిత్వం. అందరూ కలిసి, అందరితో కలిసి ఒక మహా రాతిలో పాల్గోనవలె.

    ReplyDelete
  8. భాధ్యతా విమర్శా అని మాట్లాడిన అనామకుడికి,

    కొద్దిగా మీరు చెబుతారా , పిచ్చి ఏమిటో ప్రేలాపనలు ఏమిటో? వీటికి అర్థం ఏమిటో? ఒక కామెంట్ ఏ ఆధారం లేకుండా ఇవ్వడం తేలిక, కట్టుబడి ఉండటంమే కష్టం. మీరు ఆ పని చేయగలరా?

    ReplyDelete
  9. "నేనొక ఇంటినైతే
    నాలుకతో ఎవర్ని వెక్కిరించాలి
    సూర్యుడి కన్నీళ్ళనా ? "

    దీన్ని ప్రేలాపన అని కాకున్డా ఇంకో పేరు తెలియజేయమని Post - Post Modernistic, Post Deconstructionist, Post - End of History, Post Derudian, Post Foucaultian,Post Masturbationistic, మహాకవులకి ప్రార్ధన...

    దేన్ని బద్దలుకోడుతున్నారు ? దేన్ని ధ్వంసం చేస్తున్నారు? వ్యాకరణాన్నా ? అర్డాన్నా ? నిఘంటువునా? కవిత్వాన్నా ?భావాన్నా? దేన్ని ?
    పైన ఇచ్చిన వాక్యాలు చాలునా ? వాటిని ఇంకా బద్దలు కొట్టి,విశదం చేయమన్టారా?
    ఎన్దుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, మమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తారు ? అదృష్టవశాత్తు, మీ ప్రేలాపనలని చదివేవాళ్ళు తక్కువ.

    ReplyDelete
  10. this remix is good.. and very new..

    there are few poets in telugu who are writing international poems.

    let us not try to apply any theory before reading any poem..

    i too agree any insulting tone will do no good for neither the reader nor the writer..

    i hope poets will ignore harsh comments and keep on writing as they WISH...

    ReplyDelete
  11. అజ్జ్ఞ్నాన అజ్జ్ఞ్నాతలారా,
    మనమే తినేద్దాం.
    మనం రాసినవాక్యాలని
    తన పిల్లల్ని తిన్నట్టు,పాము


    ఇంకొ పాముని బుట్టలోంచి తీసి
    మన్త్రించి విసిరేద్దామా/వద్దా>

    బుడగలలొంచి వాక్యాలు
    పడగలెత్తి పగ పడతాయి

    నాలుకని రుచి చూసిన కన్ను
    చెవికి పుల్లటి మెదడు రుచి...

    ఈ ప్ప్రేలాపన అనంతం గురూ...

    ReplyDelete
  12. మూస పోసిన సినిమాలు చూసే వాళ్లకి తర్కోవిస్కి సినిమాలు అర్థం కాలేదంటే ఏం చెబుతాం? abstract ఆర్ట్ అర్థం కాలేదు, వివరించమంటే ఏం చెబుతాం? నచ్చితే చెప్పటం భాద్యతత, నచ్చకపోతే విమర్శించడం హక్కు అట. ఎవరిచ్చారో ఇవి. ఎవరి తరుపున తీసుకున్నారో ఇవి. కొంచెం వివరించి చెబుతారా?

    ReplyDelete
  13. for the original poem my m.s naidu see msnaidu.blogspot.com so that one can see the difference and probably will have worthy criticism

    ReplyDelete
  14. have posted the original version of the poem by m.s naidu for the convenience of the readers. thanks to the writer for permitting to use his work.

    ReplyDelete
  15. I am tempted to say some thing...

    సన్యాసి సన్యాసి "రాసుకుంటే" ఏమగును? ఇదిగో ఇటువంటి బూడిద కవిత్వం రాలును.

    isnt it it obvious ?

    ReplyDelete
  16. ప్రేలాపనలో ఆలాపనలు కలవు, వాటిని వినడానికి ప్రయత్నించండి. సన్యాసులు కాని వాళ్లకి చెప్పేది ఏమీ లేదు. అర్థాలు నిఘంటువులో ఉంటాయని బ్రమ పడేవాళ్ళకూ చెప్పేది ఏమీలేదు

    ReplyDelete