22 December 2010

ఉన్నాను.(remix version)

వచ్చాను ఇంటికి
వాళ్ళు ఇల్లు అని పిలిచే ప్రదేశానికి
వచ్చాను
వచ్చాను నా వద్దకి
వచ్చాను నా వంటి ఇతరుల వద్దకి

ఏమీలేదు

((ఇది ఒక దీపం లేని సమాధి
ఇది ఒక
దేహం లేని సమాధి.
ఇంటిలో
అపరిచితుడని
అపరిచితుల మధ్య
పరచితుడని
ఈ ఇల్లు ఇక ఎప్పటికీ
దీపం పెట్టలేని సమాధి))

ఏమీలేదు


ఖాళీ తెలుపు కాగితాల కింద
కప్పబడే
గాయం పై గాయం
గేయం పై గేయం
దేహం పై దేహం
దాహం పై దాహం

ఏమీలేదు

దాహమైన దేహం
దేహమైన దాహం
గాయంగా మారిన గేయం
గేయంగా మారిన గాయం
ఏమీలేదు

వచ్చాను
ఇతరుల వంటి నీ వద్దకి
గూడు కానీ
దీపం కానీ లేని
ద్వీపంలా మారిన ఇంటికి
ఇల్లు అని పిలిచే
ప్రదేశానికి
నిషిద్ధమైన ప్రవేశమై
వచ్చాను
నావంటి ఇతరుల వద్దకి

((భార్యగా ఉండలేని భార్య
భర్తగా ఉండలేని
అతడు_ అతడిగా మారిన
నేను:
రహదారులన్నీ రాత్రిపూట
తలదాచుకునే
శరణాలయాలు అవుతాయి
నిన్ను దోచుకునే
హంతక హస్తాలు అవుతాయి
ఎవరూ
ఎవరుగా ఉండని చీకట్లో
నువ్వు
ఎక్కడికి వెడతావు?))

ఏమీ లేదు

పరుగిడీ పరుగిడీ
పారిపోయీ పారిపోయీ
విరిగిపోయీ
ఒరిగిపోయీ
శరనార్ధినై, వివశితుడనై
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నన్ను నేను
నగ్నంగా
అద్దాన్ని ప్రతిబింబించే
అద్దంలో
చూసుకునేందుకు
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నేను
ఎక్కడా లేనని
తెలుసుకునేందుకు
మరణిస్తూనే ఉన్నాను
ఉన్నాను.

ధన్యవాదాలు

((ధన్యవాదాలు, ఎప్పుడూ
ఎవరికీ చెప్పకు.
ధన్యవాదాలు))

4 comments:

  1. హతవిధీ, ఇప్పుడు కవిత్వంలో కూడా రీమిక్స్లా?

    ReplyDelete
  2. తప్పేంటి ఉంటే.
    సంకలు/చంకలు, తొడలు బాదుకుంటూ సంగీతంలో మునిగే వాళ్లకి remixనీ ఎందుకు ఆహ్వానించారు అలాంటప్పుడు? మరీ విడ్డూరం సుమండీ.

    ReplyDelete
  3. అటువంటి రీమిక్స్ పైత్యాలకు దూరంగా కవిత్వం ఉంటె బావుంటుందని భావన. అయినా కాదు కూడదు అంటే ఎవరైనా ఏం చేయగలరు, ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకోవడం తప్ప!

    ReplyDelete
  4. blog poets are crossing the borders of telugu magazine poems.. now we can see the real poems & poets.. in the blogs. we come across a poet if he writes as and when if he wants to...

    but in magazines? there are no poets.. there are bundles of poems which are yet to open their eyes... yet there is no poetry published..

    srikanth..carry on...poetry is at poet's liberty..

    ReplyDelete