04 June 2016

నేర్పు

లొంగిపో పూర్తిగా: అడగకు ఏమీ. విను
నింపాదిగా -
***
ఈ రాత్రిని: తడచిన రెక్కల బెంగని -
కొస ప్రాణంతో నిలబడిన గూటిని. గాలికి ఒరిగిన
కొమ్మలని

వాననీటి దారుల్ని, తననీ, ఇంటికి
తిరిగిరాని ఓ పసివాడి తల్లి హృదయాన్నీ: తనలో
తన శరీరంలో

ఏ నీడల మాటునో దాగిన నీలోనో!
***
అడగకు ఏమీ: లొంగిపో పూర్తిగా. విను
నింపాదిగా -
***
రాత్రి గూటిలో జాబిలిని దాచి, మెత్తగా
భూమిని పొదిగే ఈ

వాన పావురాన్ని!

1 comment:

  1. రాత్రి అస్సలు నిద్ర పట్టనప్పుడు, నెప్పి వదలనప్పుడు వస్తానీ చంద్ర నీలిమ లోనికి. తప్పక దొరుకుతుంది ఒక చరణం నా పాట నేను పాడుకుంటూ ఒక శాంతి లోనికి జారడానికి. ఇప్పుఢు ఈ చరణలు.... మొన్న ఒక సారి చూసినవే:‘రాత్రి గూటిలో జాబిలిని దాచి, మెత్తగాభూమిని పొదిగే ఈ వాన పావురాన్ని!’

    ReplyDelete