నడవలేక ఇక, అతను అక్కడే కూలబడతాడు -
మరెక్కడో గాలి
నెమ్మదిగా
"ఏమయ్యింది నాన్నా"
మరెక్కడో గాలి
సుడులు తిరిగి తిరిగి నెమ్మదిగా ఆగిపోతుంది. వడలిపోయి
ఒక పూవు తల వాల్చేస్తుంది. ఇక
సాయంకాలపు పల్చటి చీకటినెమ్మదిగా
ఆ గదిలో వలయాలుగా వలయాలుగా చుట్టుకుంటుంటే
లోపలంతా వేర్లు వెలికి వచ్చిన వాసన: నేలపై
పక్షి గూడు చీలికలై మిగిల్చిన ధూళి
సొన. ఆకులూ, ఈకలు -"ఏమయ్యింది నాన్నా"
అని పిల్లలు ఆ తరువాత ఎప్పుడో హత్తుకుని అడిగితే
అతను గొణుక్కుంటాడు ఇలా తనలో తాను
బీతిల్లిన గొంతుతో, ఒక స్మృతితో:
"నేర్చుకుంటారు
త్వరలో మీరు కూడా - జీవించడం ఇలాగ:
త్వరలో మీరు కూడా - జీవించడం ఇలాగ:
వేయి దీపాలు ఆరిన హృదయంతో
ఆ పొగతో."