ఇల్లాగే వెళ్ళిపోతాం నువ్వూ నేనూ-
ఇల్లాంటి పల్చటి గాలిలాగే, ఇల్లాంటి వానా కాలపు మబ్బుల్లాగే, బరువుగా, తేలికగా
నింపాదిగా ఇల్లాగే -
అప్పుడు గుర్తుండవు ఇవేమీ. ఈ క్షణాలు-
నువ్వూ నేనూ తిట్టుకున్నవీ, కొట్టుకున్నవీ, మన మౌనాలతో క్షతగాత్రులమైనవీ, దిగులుతో
ఒంటరిగా పడుకున్నవీ
ఒంటరిగా వణికిపోయినవీ, కూర్చున్నవీ
ఉగ్గపట్టుకున్నవీ, తమలో తాము చుట్టుకుపోయి కుదించుకుపోయి, ఏడ్చీ ఏడ్చీ లోపలెక్కడో
ఆఖరకు నిలిచిపోయినవీ
ఇవ్వేమీ గుర్తుండవు మనకి అప్పుడు.
ఆనాడు మనం కలుసుకున్నప్పుడు, నీలో నాలో రేగిన ప్రకంపనాల తప్ప, ఇప్పటికీ
కొట్టుకు వచ్చే ఆ తరంగాలు తప్ప
ఆనాడు మనం కలుసుకున్నప్పుడు
ఏర్పడిన ఒక అమాయకపు ఇష్టం తప్ప
కలిసి బ్రతుకుదామనే ఒక నులి వెచ్చటి స్వప్న సువాసన తప్ప, మట్టి దారుల్లో మనం
నడుస్తున్నప్పుడు నేను నీకు ఇచ్చిన
ఒక అనామక పసుపు పూవు తప్ప
ఆనాటి నీ చిరునవ్వు తప్ప, నువ్వు నా అరచేతి పుచ్చుకుని గట్టిగా ఒత్తిన స్పర్శ తప్ప
చెవిలో చెప్పిన గుసగుసలు తప్ప
ఆ పెదాల తడి తప్ప, ఆ రాత్రి తప్ప
హత్తుకున్న మన చేతులు తప్ప, మన శరీరాల తప్ప, లోతైన మన అవయవాల భాష తప్ప
అంతిమంగా, ఆనాడు
మనం కలుసుకున్నప్పుడు
మొదలయ్యిన ఒక జీవితకాలపు పవిత్ర నేరం, శిక్షా, సజీవ ఖైదూ తప్ప, 'నీతోనే జననం
నీతోనే మరణం' అనే కాలం తప్ప
నాకు నువ్వూ, నీకు నేనూ తప్ప
అప్పుడు మరేమీ గుర్తుండవనీ, ఇల్లాంటి పల్చటి గాలిలాగే, ఇల్లాంటి రాత్రి మబ్బులలాగే
బరువుగా, తేలికగా ఇల్లాగే
మనం వెళ్లిపోతామంటే, అలా అని
నేను చెబుతున్నానంటే
నువ్వు నన్ను నమ్ము మరి!

No comments:
Post a Comment