పక్కనే ఉన్నావు నువ్వు; కానీ, ఎంతో దూరం,
బహుశా, నేల నుంచి నింగికీ,
మెరిసే చుక్కలకు ఆవలగా, ఇంకా దూరంగా
మరెక్కడో, నే చూడలేని చోట ...
(నువ్వు )
శీతాకాలం; రాలే ఆకులు పాదాల కింద నలిగి
చిట్లే సవ్వడి. నీడల్లో ఒరిగిన
కాంతి; ఇక తలుపులు తెరిస్తే, అప్పటిదాకా
అక్కడెవరో ఎదురు చూసి
వెళ్ళిపోయిన తడి; గాలిలో! ఒక శరీరం అట్లా
మెరిసి, అంతలోనే కనుమరుగు
అయ్యినట్టూ, కన్నీటి చారికలతో, తల్లికై ఒక
పాప చేతులు చాచి నిలబడినట్టూ,
(నేను )
***
పక్కనే ఉన్నావు నువ్వు; కానీ, ఎంతో దూరం,
ఎంతో ఒంటరితనం; శూన్యం -
ఎంతో నొప్పి; ఎట్లా అంటే, చర్మాన్ని చీల్చి,
ఎవరో మరి, నెత్తురు గింజల
ఎంతో నొప్పి; ఎట్లా అంటే, చర్మాన్ని చీల్చి,
ఎవరో మరి, నెత్తురు గింజల
దానిమ్మను ఎంతో మెల్లిగా వొలుస్తున్నట్టు!
No comments:
Post a Comment