"there is no moon outside" అతను
ఆన్నాడు ఆమెతో,
తనకి ఆనుకుని బయటకి చూస్తో -
తిని వెళ్లిపోగా, సింక్ నిండా అంట్లు;
శీతాకాలం మాత్రమే
కనిపించే, సన్నని పురుగులేవో -
రాత్రంతా కాలిన నెగళ్ళు, రెక్కలు
తెగి, కొంచెం మెరుస్తో,
చుక్కలై, చలికి మిణుకుమంటో -
కుర్చీలో, shawl లో మునిగి ఆవిడ;
కళ్ళేమో, రాత్రిని తాగి
తూలే, ఎర్రెర్రని కాంతి మొగ్గలు!
***
"there isn't sunshine either" said
Esther, తనలో వొరిగి
తన్లోనే భస్మమయిన అతనితో!
No comments:
Post a Comment