ఎలా
గడచిపోయిందో కాలం: అంత త్వరగా -
శీతాకాలపు రాత్రి.
చలించే నీడలు. తెరలు తెరలుగా కోసే గాలి. రాలే పసుపు
పూలు -
నీ అరచేతిలోంచి
నీ పిల్లవాడి వేలు చేజారి పోయినట్టు లోపంతా ఖాళీ. బెంగ.
నొప్పి -
ఏం చేయాలో
తెలియని బెదురు. భయం. అలసట. లతలు తెగిన దిగులు.
కంపన -
ఎలా
గడచిపోయిందో కాలం అంత త్వరగా
మరి తెలియదు
ఎప్పటికీ మనకు -
ఇక అంతిమంగా వెనుదిరిగి చూసుకుంటే, ఎక్కడో
మనం
ఎప్పటికీ చేరలేని దూరాలలో

శోకతప్త హృదయంతో ఇంటికి దారి వెతుక్కుంటూ ఈ లోకపు
సంతలో
నీ నుంచి తప్పిపోయిన
ఒక పిల్లవాడు!
సంతలో
నీ నుంచి తప్పిపోయిన
ఒక పిల్లవాడు!
No comments:
Post a Comment