ఎంతో ఖాళీగా లోపల: రాలిపోయాయి పూవులు.
ఊగుతూ నీడలు. సాయంత్రం -
నువ్వు రావని తెలుసు. అయినా ఒక పిచ్చి నమ్మకం:
ఎవరో వచ్చినట్టూ, నుదిటిపై అరచేయి
ఉంచినట్టూ, దగ్గరగా హత్తుకున్నట్టూ ఏవేవో మాటలు
మెత్తగా చెప్పి, పక్కన అట్లా ఉండినట్టూ -
***
ఎంతో దిగాలుగా లోపల: దారి తప్పిన పిల్లాడికి మల్లే -
నీవు లేక
ఎంత నిస్సహాయుడను నేను
ఈ పూట!

No comments:
Post a Comment