నేనొక పూల పాత్రని
నీ అస్తిత్వపు అంచున ఉంచుతాను
దానికి నీరువి నువ్వే
సూర్యరశ్మివీ నువ్వె
ఆ పూలపై కురిసే వర్షానివీ నువ్వే
ఆ పూలను పదిలంగా చూసుకుని
సూర్యరశ్మివీ నువ్వె
ఆ పూలపై కురిసే వర్షానివీ నువ్వే
ఆ పూలను పదిలంగా చూసుకుని
నేను ఎక్కడికి వెళ్ళినా
నేను ఏం చేసినా
ఒక పాప నవ్వులా నన్ను వెంటాడే
నేను ఏం చేసినా
ఒక పాప నవ్వులా నన్ను వెంటాడే
ఒక పరిమళాన్ని
ఆ పూలకు అందించేదీ నువ్వే
మరణించడం తేలిక
జీవించడమే మృత్యువు అంత కటినమైనది
నేను ఇంతకు మునుపే చెప్పాను
మరణించడం తేలిక
జీవించడమే మృత్యువు అంత కటినమైనది
నేను ఇంతకు మునుపే చెప్పాను
ఇదొక చిన్ని చిన్ని కవిత అని-
చూస్తూ ఉండు
నీకు ధన్యవాదాలు తెలిపేందుకు
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేందుకూ
ఈ వాక్యం చివర
నీ కలల మరో వైపును తాకే
ఉనికి ఒకటి ఉంది.
No comments:
Post a Comment