పాపుల పవిత్ర రాత్రి ఇది
గులాబీ రాత్రి ఇది. నీ కనుల అంచులలో
ఎర్రగా మారుతున్న
ఒక తెల్లని గులాబీ రాత్రి ఇది
ప్రేమా? వద్దు. ధన్యవాదాలు.
దయా? వద్దు. ధన్యవాదాలు.
ఎర్రగా మారుతున్న
ఒక తెల్లని గులాబీ రాత్రి ఇది
ప్రేమా? వద్దు. ధన్యవాదాలు.
దయా? వద్దు. ధన్యవాదాలు.
ఇది చెప్పు నాకు
పగటి చీకటిలో కానీ
రాత్రి కాంతిలో కానీ
నీ చేతి వేళ్ళ చివర్లు
పరిమళపు పుష్పాలుగా కానీ
పచ్చిముళ్ళుగా కానీ
ఎలా మారగలవో చెప్పు నాకు-
రాత్రి కాంతిలో కానీ
నీ చేతి వేళ్ళ చివర్లు
పరిమళపు పుష్పాలుగా కానీ
పచ్చిముళ్ళుగా కానీ
ఎలా మారగలవో చెప్పు నాకు-
చెప్పు, ఇది చెప్పు నాకు
పగలు కానీ రాత్రి కానీ నీ స్వరం
కొనసాగే హింసా చిహ్నమై
మళ్ళా అంతలోనే ఒక ఇంధ్రధనుస్సై
పగటినీ రాత్రినీ కలుపుతున్న
జీవితపు ఊయలకు పైగా ఎలా
వికసించగలదో చెప్పు నాకు-
చెప్పు, ఇది చెప్పు నాకు
ఒక పక్షి తన గూడును వొదిలి వెళ్ళినప్పుడు
ఒక పావురం రాలి పడిపోయిన
తన గుడ్డు వైపు చూస్తున్నప్పుడు
ఒక పావురం రాలి పడిపోయిన
తన గుడ్డు వైపు చూస్తున్నప్పుడు
చెప్పు, ఇది చెప్పు నాకు
ప్రపంచం ఎలా ఉండేదో
ప్రపంచం ఎలా ఉందో
ప్రపంచం ఎలా ఉండబోతుందో: నీకు తెలుసు
వాళ్ళకూ తెలుసు
రాలిపడిపోయి, పిగిలిపోయి
జన్మించక మిగిలిపోయిన
ఆ పక్షీ గుడ్డూ, గూడూ మనమేనని
ఇక చాలు, ఇప్పటికని-
ధన్యవాదాలు.
ప్రపంచం ఎలా ఉండేదో
ప్రపంచం ఎలా ఉందో
ప్రపంచం ఎలా ఉండబోతుందో: నీకు తెలుసు
వాళ్ళకూ తెలుసు
రాలిపడిపోయి, పిగిలిపోయి
జన్మించక మిగిలిపోయిన
ఆ పక్షీ గుడ్డూ, గూడూ మనమేనని
ఇక చాలు, ఇప్పటికని-
ధన్యవాదాలు.
Chaalaa baagundi srikanth:-):-)
ReplyDeleteరాలిపడిపోయి, పిగిలిపోయి
ReplyDeleteజన్మించక మిగిలిపోయిన
ఆ పక్షీ గుడ్డూ, గూడూ మనమేనని
అద్భుతమైన భావన...