ఒక మహాసర్పపు పడగ వలే ఆకాశం నీపైకి వొంగిన రాత్రి-
నక్షత్రాలు కాన రావు. చీకట్లో నీ చుట్టూ
పూలు తగలబడి రాలిపోతున్న వాసన-
'అమ్మా' అని నిదురలో ఉలిక్కిపడి లేచిన చిరు నయనాలకీ
ఏమీ ఎరుగని, వెన్నెల వొణికే ఆ
అరచేతులకీ, ఏ స్థన్యమూ ఒక గూడు కాదు-
"ఇదొక నగరం. మనుషుల నెత్తురును
నింపాదిగా త్రాగే మనుషులను తయారు చేసే ఒక మహా నగరం-
ఇదొక రంగుల ఊబి:" అతను అన్నాడు-
ఇక అప్పుడు, నెత్తురుతో ఉప్పగా మారిన అతని పెదాల్ని తుడిచి
వొణికే అతని చేతులని తను
తన శరీరంలో ముంచుకుంటే
ఇక అక్కడ, లోపల, తన లోపల
ఒడ్డుని డీకొని, ఒడ్డుని దాటలేక, నదికీ చెప్పుకోలేక
వెనక్కి మరలి,అలాగే వెళ్లిపోలేక
మళ్ళా మళ్ళా ముందుకు వచ్చే
అనాధ అశ్రువుల అలల శబ్ధం-
ఇక అప్పుడు, చివరికి, శిశువుల వలే ఆ ఇద్దరినీ పెనవేసుకుని
తన రొమ్ముకు హత్తుకుని
ఆ రాత్రే,నిద్రలో కలవరిస్తూ
ఊగుతూ, ఊగుతూ
ఊగుతూ, ఊగుతూ
ఊగుతూ, ఊగుతూ
కన్నీరెండిన చెంపలై, ఒక తల్లై, ఒక తండ్రై, మిణుకు మిణుకుమనే కందిలిలోకి
కుంచించుకుపోయే కాంతియై
చివరగా ఒక నెత్తుటి జోలపాటై
ఊగీ, ఊగీ, ఆగీ ఆగీ
ఆఖరకు ఇలా-

Srikanth gaaroo, can baagundi:-):-)
ReplyDelete