సరిగ్గా అప్పుడు - తన అరచేతిని పట్టుకుని - ఒద్దికగా
కూర్చుంటావు నువ్వు -
ఏనాటి కాలలదో, మరి ఒక రాత్రి ధ్వని
అప్పుడు నీలో: ఆకులు అల్లాడి
గాలి వీచే సవ్వడి అతి సన్నగా నిన్ను చుట్టు ముట్టినట్టు -
సరిగ్గా అప్పుడు
చీకట్లో, చెట్టు మొదట్లో
రాలిన ఆకులూ ఎండు పుల్లలూ అంటుకున్న వాసన-
సరిగ్గా అప్పుడు
హ్రుదయంలో ఒక చితుకుల మంట
నీ హృదయమే ఒక చితుకుల మంట-
ఇక, వేడిమి తెరలు తెరలుగా వీచిపోయే నీ నుదిటిపై
తన అరచేయి అలయై ఊగుతుంటే
ఇంకిపోతావు నువ్వు
సర్వం మరచి నిద్రలోకి-
సరిగ్గా అప్పుడే, ఎప్పటిలాగే
తనకు కృతజ్ఞతలు చెప్పటం మరచి -
కూర్చుంటావు నువ్వు -
ఏనాటి కాలలదో, మరి ఒక రాత్రి ధ్వని
అప్పుడు నీలో: ఆకులు అల్లాడి
గాలి వీచే సవ్వడి అతి సన్నగా నిన్ను చుట్టు ముట్టినట్టు -
సరిగ్గా అప్పుడు
చీకట్లో, చెట్టు మొదట్లో
రాలిన ఆకులూ ఎండు పుల్లలూ అంటుకున్న వాసన-
సరిగ్గా అప్పుడు
హ్రుదయంలో ఒక చితుకుల మంట
నీ హృదయమే ఒక చితుకుల మంట-
ఇక, వేడిమి తెరలు తెరలుగా వీచిపోయే నీ నుదిటిపై
తన అరచేయి అలయై ఊగుతుంటే
ఇంకిపోతావు నువ్వు
సర్వం మరచి నిద్రలోకి-
సరిగ్గా అప్పుడే, ఎప్పటిలాగే
తనకు కృతజ్ఞతలు చెప్పటం మరచి -
చితుకుల మంట అంటూ హృదిిని కవిత్వ తాత్విక వెచ్చదనపు స్పర్శతో రాసిన నీన్ను అభినందిస్తు
ReplyDeleteచితుకుల మంట అంటూ హృదిిని కవిత్వ తాత్విక వెచ్చదనపు స్పర్శతో రాసిన నీన్ను అభినందిస్తు
ReplyDelete