ముసలి వాళ్ళం అవుతున్నాం మనం - చూడు
ఎదురింటి మేడ మీద ఎప్పటిలా
ముక్కుతో రెక్కల కింద పొడుచుకుంటూ
నీ వైపు చివ్వున చూసే పావురం
ఈవేళ రాలేదు: ఉదయం కురిసే
పొగమంచుకీ, సాయం సంధ్యకీ, మన గదులలో
రాత్రుళ్ళలో కంపించే నీడలకీ
నా పెదాల్ని నిర్లిప్తంగా తాకే నీ
పెదాలకీ, ఈవేళ పెద్ద తేడా ఏమీ లేదు: ఏం లేదు-
కొంత నొప్పి కొంత బెంగ. కొంత...
ఒకరినొకరు తాకబోతూ, ఆఖరి
క్షణంలో ఆగిన నీ అరచేతికీ నా
అరచేతికీ మధ్య మిగిలిన దూరంలో
వలయాలుగా రాలిపోతూ ఆకులూ
గూటికి తిరిగి రాని పక్షుల ఈకలూ
కుంచించుకుపోతున్న కాంతీనూ-
ఇక ఎలా గడవటం ఈ కాలం, నీ నుంచి
నాకూ, నా నుంచి నీకూ
ఆకులు రాలే ఈ వేళల్లో?
ఎదురింటి మేడ మీద ఎప్పటిలా
ముక్కుతో రెక్కల కింద పొడుచుకుంటూ
నీ వైపు చివ్వున చూసే పావురం
ఈవేళ రాలేదు: ఉదయం కురిసే
పొగమంచుకీ, సాయం సంధ్యకీ, మన గదులలో
రాత్రుళ్ళలో కంపించే నీడలకీ
నా పెదాల్ని నిర్లిప్తంగా తాకే నీ
పెదాలకీ, ఈవేళ పెద్ద తేడా ఏమీ లేదు: ఏం లేదు-
కొంత నొప్పి కొంత బెంగ. కొంత...
ఒకరినొకరు తాకబోతూ, ఆఖరి
క్షణంలో ఆగిన నీ అరచేతికీ నా
అరచేతికీ మధ్య మిగిలిన దూరంలో
వలయాలుగా రాలిపోతూ ఆకులూ
గూటికి తిరిగి రాని పక్షుల ఈకలూ
కుంచించుకుపోతున్న కాంతీనూ-
ఇక ఎలా గడవటం ఈ కాలం, నీ నుంచి
నాకూ, నా నుంచి నీకూ
ఆకులు రాలే ఈ వేళల్లో?
No comments:
Post a Comment