31 January 2014

శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు

1.శ్రీకాంత్, మీ కవిత్వం చదువుతున్నప్పుడు అది కేవలం వొక సాహిత్య ప్రక్రియగా కాకుండా, వొక మానసిక ప్రక్రియగా పనిచేస్తుందని అనిపిస్తుంది? అసలు కవిత్వం ఏమిటి మీకు?

A: అన్ని ఇంటర్వ్యూలు పాక్షికంగానైనా ఆటోబయోగ్రాఫికల్ కనుక, అన్ని ఆత్మకథలూ ఒక కథ స్థానంలో మరోకటిని చెబుతాయి కనుక, ప్రతి ఆత్మకథా ముందుగా ఒక రహస్య ఒడంబడికతో నన్ను నమ్ము.  నేను సత్యమే చెబుతున్నాను అని నివేదిస్తుంది కనుకా, రచయితకీ చదువరికీ ఆ ఒప్పందం లేనిదే ఆత్మకథ మన్నదు కనుకా, ఇవన్నీ genreకు సంబంధించిన ప్రశ్నలూ, రాజకీయాలూ కనుక ముందుగా ఒక disclaimer: Do not take me seriously. This could be a truth in fiction. This could be a fictional truth too. And all poets tell the truth, in truth except the truth.

నా జీవితంలో లేదా ఇతరులు జీవితం అని దేనినైతే అంటారో, దానిలో/ దానితో నేను ఎన్నడూ సౌకర్యవంతంగా లేను. జీవితంతో కానీ, నాతో కానీ. అందులో పెద్ద వైవిధ్యభరితమైన విషయం కానీ, వింతైన విషయం కానీ ఏమీ లేదు. (మనలో చాలా మంది తమ జీవితాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. అశాంతితోనూ ఉన్నారు. (Whats the big issue about it?) Anyway, ఏమిటంటే, ఇతరులు take it for granted గా తీసుకునే విషయాలు నాకు ఇప్పటికీ అర్థం కావు. అవి పెద్ద తాత్వికమైన విషయాలు కానక్కర లేదు. ఉదాహరణకు ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉండటమే ముఖ్యంఅని అన్నారు అనుకోండి, నా సమస్య అంతా ముందుగా పదాలతో, వాటి నిర్వచానాలతో మొదలవుతుంది. జీవితం అంటే ఏమిటి? జీవితం అని ఒకరు అన్నప్పుడు తద్వారా వాళ్ళు దేనిని సూచిస్తున్నారు? సంతోషం అంటే ఏమిటి? ఉండట మంటే ఏమిటి? ఈ పదాలు – జీవితం, ప్రేమ, లేదా సంతోషం - can they exist in themselves? Unequivocally? Or they exist in relation to something else? ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, భావనా సంబంధమైన కొన్ని పదాలు (conceptual terms)  కాలక్రమేణా సంస్థలుగా మారతాయి. సంస్థలుగా వ్యవహరిస్తూ కొన్ని విలువలని పరిరక్షిస్తూ అటువంటి విలువలని వ్యాపింపజేస్తాయి. ఈ చిన్న ఉపోద్గాతం ఎందుకంటే, రాయటం అనేది నాకు మొదటిసారిగా ఇటువంటి ప్రశ్నలతోనూ యవ్వనపు- అమాయకత్వాన్ని కనుమరుగు చేసిన  ఘటనలతోనూ ముడిపడి ఉంది. ఆ ఘటనలు అన్నీ కూడా... ఒక స్థాయిలో వ్యక్తులకు సంబంధించినవీనూ మరో స్థాయిలో రాజకీయాలకు సంబందించినవీనూ. ఈ రెండూ కూడా స్వాభావికంగా, అంతర్గతంగా అన్యత్వానికీ, జాతికీ ముడిపడి ఉన్న అంశాలు.  Things that are connected to the questions of the Other and the Nation.

నేను రాత వద్దకి ఒక దేహం ద్వారా వచ్చాను. నేను రాత వద్దకు ఒక దేహం ద్వారా, ఒక ముస్లిం దేహం ద్వారా, ఒక స్త్రీ దేహం ద్వారా వచ్చాను, అటువంటి దేహం, అటువంటి స్త్రీత్వపు దేహం - ఉన్మాద హిందుత్వ రాజకీయాలకూ, హింసలకూ, హత్యలకూ అత్యాచారాలకూ చీలికలై, చీరికలై విలవిలలాడటానికి – నా పద్దెనిమిది ఏళ్లకే నేను ఒక నిస్సహాయ సాక్షిని. ఈ వయస్సులోనే, నాకు నా శరీరం పట్ల స్పృహ కలిగింది.  శరీర రాజకీయాల పట్లా జీవిత రాజకీయాల పట్లా (bio and body politics) కూడా తొలిసారిగా కొంత కలిగింది. దేశం అనేది ఒక దేహమనీ, చరిత్రలూ సంస్కృతీ, రాజకీయాలూ శరీరాలపై లిఖించబడతాయనీ, శరీరాల ద్వారా ధ్వంసం చేయబడతాయనీ కూడా ప్రత్యక్షంగా తెలిసింది. ఆ సమయంలోనే, దేశంలో ఇతరునితుడిపివేయడం అనే ఒక process మొదలయ్యి బాబ్రీ మజీద్ విధ్వంసం దాకా వచ్చింది. A continual process of erasing all that which belongs to the Other. ఈ క్రమంలో, చాలా వాటికి నేను సాక్షినే కాక, - వాళ్ళు ఇతరులు అయిన కారణానికి-నేను  చాలా మందిని పోగొట్టుకున్నాను. ముస్లిం అయినందుకు, అకారణంగా దాదాపు తగలబడిపోయినంత పనైన రవూఫ్ నూ, దగ్ధమైపోయిన అతని న్యూస్ పేపర్ల షాపునూ, ఇర్ఫాన్ నూ, ముస్లిం అయిన కారణాన ఎవరూ మాట్లాడని నూరల్ హసన్ నూ, అజ్మత్, జువేరియా, నాహీద్... ఇట్లా చాలామందిని... ఇట్లా పోగొట్టుకునే ప్రక్రియలో,  మూస నిర్వచనాల నుంచి నన్ను నేను కనుక్కునే ప్రయతంలో రాత నాకు ఒక గూడు అయ్యింది. శరనార్ధీ అయ్యింది. Or rather, I became a refugee in writing.

ఇట్లాంటి క్రమంలో నేను రాసుకోవడం మొదలు పెట్టాను కనుక, రెండు ప్రశ్నలు అప్పుడు నాకు చాలా ముఖ్యంగా మారాయి: దేహం ఇంకా నామవాచకం లేదా నామ్నీకరణం. The process of naming (read also as framing), and consolidating it through body, texts and images. ఉనికికి సంబంధించిన ప్రశ్నలతో ఎంగేజ్ అయ్యి ఉన్న వాళ్లెవరికైనా, రాతలో ఇటువంటి ఎంగేజ్మెంట్ ఖచ్చితమైన సాహిత్య ప్రక్రియగా కాకుండా, మానసికమైన tussle లాగా కూడా ఉంటుంది. అనివార్యంగానే అటువంటి రాత, (లిఖితం) ఒకరు తనతో తాను ఏర్పరుచుకునే సంభాషణ లేదా ఒకరి స్వాగతం లాగానే, ఒక అంతర్గతమైన మానసిక ప్రక్రియలాగానే ఉంటుంది అని నేను అనుకుంటాను. And hence I would like to say that my texts (I would like to call them texts, instead of poems/poetry) are my engagement with myself on the things that concern me through language in language. ఇక కవిత్వం/లిఖితం అంటే ఏమిటి మీకు అనే దానికి ఇల్లా ఒక రచయిత్రి భాషలో చెబుతాను:

“We should write as we dream; we should even try and write, we should all do it for ourselves, it’s very healthy, because it’s the only place where we never lie. At night we don’t lie. Now if we think that our whole lives are built on lying-they are strange buildings-we should try and write as our dreams teach us; shamelessly, fearlessly, and by facing what is inside very human being-sheer violence, disgust, terror, shit, invention, poetry. In our dreams we are criminals; we kill, and we kill with a lot of enjoyment. But we are also the happiest people on earth; we make love as we never make love in life.”


 2. మీరు తొలినాళ్లలో రాసిన కవిత్వం నించి ఇప్పటిదాకా మీకు మీరు వొక గ్రాఫ్ లో చూసుకుంటే ఆరోహణలూ, అవరోహణలూ ఎలా అనిపిస్తున్నాయి?

నేను నా జీవితాన్ని, లేదా నా రాతలని (అవి రెండూ వేరే వేరే అయినట్టయితే) ఎన్నడూ ఆరోహణ, అవరోహణలతో చూసుకోలేదు. చూడను కూడా. For the simple reason that writing is not a career to me.  నా వరకూ నాకు ముఖ్యమైనది ఏమిటంటే, ఈ జీవించడాన్ని ఈ జీవితాన్ని పూర్తి సాంద్రతతో అనుభూతి చెందటం, తిరిగి అంతే సాంద్రత తో రాయడం. Interesting thing is that this ‘living’ itself, the understanding of this ‘living’ itself takes a form of writing for me. Though not on paper, as such.  నేను రాయడం మొదలు పెట్టిన కొత్తలో (1992), ఉన్మాది లాగా రాసుకునే వాడిని. (Perhaps we all go mad in writing  - at least- at some point of time in our lives). నా మొదటి పుస్తకం 2000లోనూ, రెండోవ పుస్తకం 2002లోనూ వచ్చాయి. ఆ తరువాత దాదాపు ఎనిమిది ఏళ్ళు నేను ఏమీ రాయలేదు (2002-2010). అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదు. కొన్నిసార్లు విసుగు పుడుతుంది – we are bored to death and are fed up with ourselves and our writing. ఇక ఒక రచయిత/కవి నిరంతరం రాస్తూనే ఉండాలి అనే వాఖ్యను నేను అస్సలు నమ్మని వాడను కనుకా, అలా అనుకోవడం నిన్ను ఒక ప్రెజర్ లోకి నెట్టివేస్తుందనీ ఆ ప్రెజర్ ఆ కంపల్సివ్నెస్ నీ రాతని చంపివేస్తుంది అని తెలుసిన వాడిని కనుకా, ఏమీ రాసుకోలేదు. Let me reiterate this: Either you write with your blood, bones skin and teeth or do not write at all. I follow this even now.   

 3. కవిగా, కవిత్వ పరమయిన ఆలోచనలు చేస్తున్నప్పుడు మీ ఆలోచనల్ని ప్రభావితం చేసే విషయాలు ఏమిటి?

A: ముందుగా ఇది: నన్ను నేను కవిగా ఎప్పుడూ చూసుకోలేదు, అనుకోలేదు. చూసుకోను, అనుకోను కూడా: ఇప్పటికీనూ. కవి అంటే ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు. Honestly, I don’t know what it means to be a poet: poetry, yes, but not a poet. For me the word poet sounds very vulgar. I don’t subscribe to it.

కానీ, నేను ఆలోచిస్తాను. ఆలోచించడం ఇష్టం నాకు. నా అని ఏదైతే ఉందో, ఆ భాగం ఆలోచిస్తుంది కానీ, ఒక కవిలాగా కాదు.  I think, I like thinking but when I think, the ‘I’ of me thinks but not as a poet. మరొక ప్రాధమికమైన విషయం ఏమిటంటే, when one thinks, one is bound by many things: things that make our thought process. నా ఆలోచనా విధానాన్ని ఒక deep suspicion guide చేస్తూ ఉంటుంది. A deep suspicion of all that is given and is taken for granted. ఉదాహరణకు కవిత్వం అనే పదమే తీసుకుందాం. ఒక కవిత ఎలా ఒక కవిత లేదా కవిత్వం అవుతుంది? What constitutes a poem? కవిత్వాన్ని ఎవరు నిర్వచిస్తారు/ నిర్వచిస్తున్నారు? అటువంటి నిర్వచనాలాలో, అటువంటి నిర్వచనాలను uphold చేసే సాహితీ విమర్శలలో ఉన్న రాజకీయాలు ఏమిటి?  Who defines poetry? What are the standards of poetry? Who defines, guides and guards these standards and for what purpose? Whose interests are being served in safeguarding certain conservative norms of genre?

నా మటుకు, ఇటువంటి ఆలోచనా విధానం నాకు అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఇటువంటి line of thinkingలో one clearly sees the connection between genres, and the sociological apparatus that upholds these genres for certain values, which finally serve the interests of certain caste, class and community.  

4. మీరు ఇంగ్లీషు కవిత్వం బాగా చదువుకున్నారు. కొన్ని సార్లు మీ వాక్యాలు చదువుతున్నప్పుడు మీరు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాస్తారని అనిపిస్తుంది. భాష విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?

A: Ah… ఇది అనువాదానికి సంబంధించిన ప్రశ్న. కదూ? అనువాదం అనేది విస్త్రుతార్ధంలో వాడుతున్నాను. ఎవరో అన్నట్టు, I am one language. I am more than one language. I doubt if anyone thinks in ONE language as such. ఈ పరమిత spaceలో ఈ ప్రశ్నలను theoreticalగా elaborate చేయడం కష్టం కనుక, సరళంగా ఇలా చెబుతాను. ఇలా కూడా అడుగుతాను.

What do you mean by this word ‘English’? ఒకవేళ అది పూర్వార్ధంలో, నేరుగా ఆంగ్లంలో రాయబడ్డది, (read as Britain, too) అనే అర్థంలో వాడబడ్డట్టు అయితే, దానికి జవాబు నేను ఆంగ్ల కవిత్వం కానీ, ఆంగ్ల రచనలు కానీ చదవను, ఆంగ్లంలో ఆలోచించాను. కానీ “English” అనేది దాని విస్త్రుతార్ధంలో, అంటే writings that are translated into English, అని మీరు అన్నట్టు అయితే, Yes, నేను ఆంగ్ల రచనలు బాగా చదువుతాను. I read a lot of “World Poetry” translated into English. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, నేను కవిత్వం చదివేది చాలా చాలా తక్కువ. వచనం ఎక్కువ. నేను కవిత్వాన్ని సీరియస్గా చదవడం చాలా కాలం క్రితం మానివేశాను. I stopped reading poetry seriously a long time back.  గత ఎనిమిది ఏళ్లుగా నేను తరచుగా చదివేది, చదువుతున్నదీ కూడా వచనమే: ఆ వచనం ఏ రూపంలో ఉన్నదైనా కానీ.   ‘ఆంగ్లవచనాలు కాదు, అనువాదంలో ప్రపంచవచనాలు. ఇక ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాయడం అంటారాఅది శైలికి సంబంధించిన విషయం అని  అనుకుంటాను. సోకాల్డ్ కవిత్వం అయితే నేను ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాయడం ఉండదు. If it is about presenting a critical thought in Telugu, I do that. ఎందుకంటే, తెలుగులో తాత్వికపరమైన కొన్ని విషయాలు మాట్లాడటానికీ, theoretical విషయాలు చర్చించదానికీ అవసరమయిన భాష నాకు అలవడలేదు కనుకా, ఇంకా అటువంటి భాష తెలుగులో విస్తృతంగా వాడుకలో లేదు కనుకా.  ఇక భాషపై నాకు చాలా నచ్చిన వాక్యం ఇది. భాష విషయంలో ఇలా ఫీల్ అవుతాను: …”Language is for the other, coming from the other, the coming of the other” అని.

5. శివారెడ్డిగారిని వొక తండ్రిగా కాకుండా వొక కవిగా మీ వ్యక్తిత్వంలో ఎంత వరకూ చూస్తారు?

A: తత్వశాస్త్రం నుంచి సాహిత్యం దాకా, ఇంకా మనకి పితరుడేకదా! It is the ‘father’ that always dominates us? Isn’t it? మన ఆలోచనల్లోనూ, మన వీక్షణాలలోనూ, మన ప్రాతిపదికలలోనూ, మన రాతలలోనూ, మన శైలులలోనూ, మన అర్థాలలోనూ, మన నిర్మాణాలలోనూ, ఇంకా మనకి పితరుడేకదా? What happens to the mother, the Other who is always with us? The M/other? Hmmm… So you want to listen to the story of my Oedipus Complex? సరే. కానీ,- ముందుగా- తండ్రీ కవీ రెండూ అయిన ఒక వ్యక్తిని విడివిడిగాచూడటం ఎలా? What comes before? And what comes after? తండ్రా? కవా? కవా? తండ్రా? తండ్రి అంటే ఏమిటి? కవి అంటే ఏమిటి? అన్నిటికంటే ముందు, వ్యక్తిత్వం అంటే ఏమిటి? ‘నావ్యక్తిత్వం అంటే ఏమిటి? కొద్దిగా కష్టం. ఇది Bios(జీవితానికి)కీ, biography (life writing or writing life)కీ, biologyకీ (read as bio+logos) సంబంధించిన విషయం కాబట్టి. ఎలా జవాబు చెప్పను? జవాబు చెప్పడానికి ఎలా ప్రయత్నించను? ఎవరైనా ఎలా జవాబు చెబుతారు? ఇటువంటి సంక్లిష్టతలలోకి వెళ్ళకుండా, at the risk of sounding naïve and simplistic, ప్రస్తుతానికి ఇలా చెబుతాను:

నా తరంపై ఉన్నట్టుగానే, అతని రచనల ప్రభావం, అతని ఆలోచనల ప్రభావం నా ప్రాధమిక రచనలపపై చాలా ఉండింది. దాని కన్నా కూడా, అతనేమిటో, అతని వ్యక్తిత్వం ఏమిటో ఆ ప్రభావం కూడా నాపై చాలా ఉంది. నేను ఇంకా కొద్దిగా మోసుకు తిరిగే మనుషుల పట్ల warmth, సహనం, కొంత ఇతరులని వినే గుణం, ఇవి నాకు అతని నుంచి వస్తే, possessiveగా లేకుండా మనుషుల పట్ల ఉండటం, ఓపికగా ఇతరులని అర్థం చేసుకోవడం, కొంత నింపాదిగా జీవితాన్ని చూడటం అనేవి తల్లి నుంచి అబ్బాయి. It sounds romantic కానీ మీకు ఇది కూడా చెప్పాలి: I have been a difficult son to bear with. Very very difficult. I had been a maniac depressive; I had been a drunkard – ఉదయం ఇల్లు వదిలి వెడితే, మళ్ళీ ఏ స్థితిలో నన్ను చూస్తానో తెలియని నా తల్లితండ్రులు వాళ్ళు. నేను ఇంటికి తిరిగి రావొచ్చు, రాకపోవచ్చు, ఎక్కడో పడిపోయి ఉంటే ఎవరో ఫోన్ చేయవచ్చు లేక ఒక పోలీస్ స్టేషన్లో లాండ్ అయ్యి ఉండవచ్చు. లేక ఏ అర్థరాత్రో ఏ ఆసుపత్రి నుంచో నా గురించి తెలుపుతూ సమాచారం రావొచ్చు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఎలా నన్ను నా తల్లి తండ్రులు భరించారా, భరించగలిగారా అని. వ్యక్తిత్వం లాంటి పదాల పట్ల నాకు నమ్మకం కానీ సదభిప్రాయం కానీ లేవు కానీ, ఆఖరుగా ఇలా చెబుతాను: Whatever I was, whatever I am, and whatever that is left of me- here, in this space and time- inscribed on this body, inscribed in this body, I owe it to him. I owe it to her. Perhaps I owe it to ‘We’.

6. స్త్రీలు...మీ కవిత్వంలో బహు పాత్రల్లో కనిపిస్తారు? ఎందుకని?

A: (I am assuming that you have used this word ‘స్త్రీలు’ to indicate the English equivalent Woman and not Female. And hence my reply proceeds from such presumption)

ఇలా ప్రశ్నించుకుందాం ముందుగా మనల్ని మనం ఒకసారి, మన పాత్రలతో మన పాత్రలలోంచి బహు విధాలుగా. ఎందుకంటే ఈ ప్రశ్న, స్త్రీల గురించిన ప్రశ్న, స్త్రీల ప్రశ్న (the question of women. Often more than once, Woman is a recurring question to us. For us. Who would deny it?) స్త్రీలు సమాధానం చెప్పాల్సిన, స్త్రీలు ప్రశ్నించాల్సిన ప్రశ్న ఏదైతే ఉందో, అది పలు స్థాయిలకి సంబంధించినది కనుక. పలు ప్రక్రియలకీసంబంధించిన కనుక. కనుక, ముందుగా ఒక ప్రశ్న: స్త్రీ అంటే ఏమిటి? స్త్రీ అని మనం అన్నప్పుడూ, లిఖించినప్పుడూ, ఉద్దేశించినప్పుడూ, సంభోదించినప్పుడూ, మనకు తెలిసింది లేదా ముందుగా తెలియాల్సినదీ ఏమిటంటే మనం బౌతికపరమైన ఒక ప్రాణి గురించి కాదు మాట్లాడుతున్నదీ అని. (When we say ‘woman’, we just don’t mean a biological being with certain organs as such. We are not just dealing with the sex of a particular species. దీనిని సూచించడానికి ఆంగ్లంలో Female అనే పదం ఉంది.) అవునా, కాదా? ఎప్పుడైతే మనం స్త్రీ అనే పదం వాడుతున్నామో, స్త్రీత్వం అనే పదం వాడుతున్నామో, మనం భౌతికమైన రూపాన్నీ, అర్థాన్నీ దాటి వాటి నిర్మాణాలపరిధిలోకి వెడుతున్నాం. అంటే స్త్రీ అనే పదం భౌతికమైన ఒక నిష్పాక్షికమైన వాస్తవాన్నిసూచించే పదం కాదు అనీ, ఇంకా అటువంటి పదం మనం వాడుతున్నప్పుడల్లా ఆ పదానికి చెందిన చరిత్రను గురించి కూడా మాట్లాడుతున్నామనీ ఆకళింపు చేసుకోవడం. అందుకే మనం మళ్ళా, మరొకసారి ఇల్లా ప్రశ్నించుకుందాం:

స్త్రీ అంటే ఏమిటి? స్త్రీ పై వందల ఏళ్ళుగా తత్వశాస్త్రంలోంచీ, చరిత్రలలోంచీ, పురాణాలలోంచీ సాహిత్యాలలోంచీ ఇంకా అనేక డిస్కోర్సల వాచక కర్మాగారాలలోంచి ఉత్పత్తి అయిన రూపాలలోంచి, వివిధ ప్రతీకలలలలోంచీ వివిధ చిహ్నాలలోంచీ వివిధ ప్రతిరూపాలలోంచీ, స్త్రీకి ఆపాదించబడిన ప్రత్యేక లక్షణాలలోంచీ స్త్రీని విడదీసి స్త్రీని చూడటం ఎలా? మనకై ఒక స్త్రీని సృష్టించి చలామణి చేస్తున్న వాచక మగ్గాలలోంచి, పునరావృతం చేస్తున్న వివిధ స్వరాలలోంచి, కుటుంబాలలోంచీ, పితృస్వామిక వాంఛా మరియు వీక్షణలోంచి తప్పించి, మనం తప్పించుకుని స్త్రీని చూడటం ఎలా? When we say ‘woman’, do we have a possibility to reach women, as such? అలా చూడాలంటే ఎటువంటి పాత్రలు కావాలి మనకి? మనం ఎటువంటి పాత్రాధారులను, దారులనీ వొదిలి వేయాలి? ఎటువంటి రూపాలతో, ఎటువంటి బహుముఖాలతో చూడాలీ, దరి చేరాలి మనం? ఎటువంటి దారిని ఎన్నుకోవాలి మనం? కానీ మళ్ళా మనం మరొకసారి ఇన్సిస్ట్ చేద్దాం: స్త్రీ అంటే ఏమిటి? చరిత్రకీ, తత్వశాస్త్రానికీ, సౌందర్యశాస్త్రానికీ’, సాహిత్యానికీ, నీతికీ, విలువల వలువలకీ, అనువాదానికీ, ముడిపడి ఉన్న, రాయబడి ఉన్న, మళ్ళా మళ్ళా రాయబడుతూ ఉన్న స్త్రీ అంటే ఏమిటి? సాధారణంగా వివిధ డిస్కోర్స్ లలో, ఇలా కనపడుతుంది స్త్రీ మనకి:

విప్లవం: స్త్రీ అంటే పునురుత్పత్తి సాధనం. ఈ స్థాయిని ఎప్పుడైనా (తెలుగు) విప్లవం లేదా విప్లవ కథా సాహిత్యం దాటిందా? స్త్రీ అంటే విప్లవానికి కొడుకులనిఉత్పత్తి చేసే సాధనం అనే స్థాయిని దాటిన ఒక నృత్యకారిణినినీ, తనదైన నృత్యం చేసే ఒక స్త్రీనీ, విప్లవం కానీ విప్లవం సాహిత్యం కానీ ఎన్నడైనా ఊహించాయా?

మతం/ఆధ్యాత్మికత: ముందుగా ఒక చిన్న quote. (enlightened అయిన ఒక వాక్యం:) రూపమూ, (అస్తిత్వం) ఉండటమూ అనేవి (నాకు) తెలియకుండా జరిగాయి. లేకపోతే నేను తొమ్మిది నెలలకై అ అపరిశుభ్ర ప్రదేశంలోనికి* ఎందుకు ప్రవేశిస్తాను?’ (Italics mine). ఏం అర్థమౌతుంది మీకు? తొమ్మిది నెలల ఆ అపరిశుభ్ర ప్రదేశం ఏమై ఉండవచ్చు? ఎవరిదై ఉండవచ్చు? గర్భం ఒక అపరిశుభ్ర ప్రదేశం, తొమ్మిది నెలలు నువ్వు గడిపిన ఆ గర్భం అపరిశుభ్ర ప్రదేశం ఎలా అయ్యింది? ఈ చిన్న ఉదాహరణ ఎందుకంటే, ‘వారసత్వంగాఒక వారసత్వంలోకి మనం జన్మించిన, మనం చదివిన, మనకు చెప్పబడుతున్న మత వాచకాలూ, పురాణేతిహాసాలూ, స్త్రీ పట్ల ఇంతకన్నా బిన్నమైన భావనలని ఏవీ ఇవ్వవు కనుక. వేదాలు కానీ, రామాయణ మహా భారతాలు కానీ ఇతర మత గ్రంధాలలోని స్త్రీ పాత్రల వివరణలు కానీ, ఇంతకంటే బిన్నమైన వ్యాఖ్యానాన్ని సూచించవు కనుక. (ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటె, డిల్లీ అత్యాచార ఘటన తరువాత సోకాల్డ్ ఆధ్యాత్మిక గురువుల ప్రతిస్పందన ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి)॥*ఈ వాక్యం నిసర్గాదత్త మహారాజ ది.॥ 

సాహిత్యం: ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్కసారి ఇంతవరకూ, సాహిత్యంలో మనం చదువుకున్న కవిత్వంకానీ, కథలు కానీ, ప్రబంధాలు కానీ లేదా విజువల్ మీడియాలో చూసే స్త్రీ పాత్రలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. లలిత కోమలమైన వాళ్ళూ’ ‘అత్యంత సౌందర్యవతులూ, ‘త్యాగానికీ, స్వార్ధ రహిత ప్రేమకీ చిహ్నం తను అనీ అనురాగమయి, సహనవతి, దేవతా, అప్సరస సీతా, సావిత్రీ అనీ ఇంకా blah blah blah… everything in black and white. Nothing else. (ప్రస్థుతానికి నేను స్త్రీ sexuality, దానిని condition చేసే, చేస్తున్న మహా కుట్రల వైపు వెళ్ళడం లేదు). ఇటువంటి నిర్ధారణలు ఎంత ప్రమాదం అంటే, ఏళ్ళ తరబడి అవి పునరావృతమయ్యి, అయ్యీ అయ్యీ ఇక స్త్రీలు తమను తాము ఆ ప్రతిరూపాలలోంచి దాటి చూసుకోవడమే ఒక ఘర్షణగా మారుతుంది. అలా చూసుకోవడమే మహాపాపం అన్నట్టుగా కనిపిస్తుంది సమాజానికి. ఎంత సంఘర్షణ అటువంటి clichéd images నుంచి బయట పడాలి అని అనుకునే స్త్రీలకీ, అటువంటి clichéd images నుంచి బయట పడక, స్త్రీలని మూర్ఖంగా పునరావృతం చేసే పురుష వాచకాలకీ!

ఇదంతా ఎందుకంటే, స్త్రీలను మనం చూసే పద్ధతి, మన వీక్షణా ఇంకా చాలా చాలా conservative అయిన అ/సాహితీ ప్రక్రియల, మతమూ పురాణాల ప్రతీకలని దాటి రాలేదు కనుక. ఇంకా ఇదంతా ఎందుకంటే, ఒక స్త్రీ , ఒక్క స్త్రీ అంటూ ఎవరూ లేరు కనుకా, ఇంకా స్త్రీ అంటే heterogeneous కనుకా, మూసలలో ఇమడని, ఇవ్వబడిన మూసలలో ఇమడలేక తమ శరీరాలకై తాము యుద్ధం చేస్తున్న స్త్రీలన నేను చూసాను కనుకా, అందులో కొంతమంది నాకు దగ్గరిగా తెలుసు కనుకా, వాళ్ళు నా జీవనంలో భాగం కనుకా, ఇంకా నాకు స్త్రీ అంటే రాత/లిఖితం కనుకా, స్త్రీలు బహురూపులు కనుకా, నా వాచకాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలుకాదు కనుకా, ఇక నాకు చాలా నచ్చే ఒక వాక్యంతో ఇలా ముగిస్తాను: that which cannot be taken in by truth, is in truth feminine, అని అనుకుంటో. ఇక ఇంకా ఇంతకు మించి ఏం చెప్పగలను నేను ఈ పరమిత పరిధిలో అని కూడా చెప్పుకుంటో.

7. ముస్లిం వ్యక్తులు .మీ కవిత్వంలోకి చాలా సౌకర్యంగా దూసుకు వస్తారు. ఎందుకని? 

A: You want to know the secret? మీకు ఆ రహస్యం తెలుసుకోవాలని ఉందా? ఇంతకు మునుపే మొదలయ్యిందానిని ఇలా అడుగుతూ మొదలు పెడతాను:

ఎందుకు రాకూడదు’? ఇక్కడ కొంత aggressiveగా కూడా ఉంటాను. కొన్ని విషయాల గురించి చెప్పుకోడానికి ఇలా కూడా అడుగుతాను, మరి మీరు ‘’సౌకర్యవంతంగా’’ ఇంకా ‘‘దూసుకురావడం’’ అనే పదాల ద్వారా దేనిని సూచిస్తున్నారో నాకు తెలియనప్పటికీ:

కొంత సేపు, ఈ శరీరం, ఈ వాచకం, ఈ వాచక శరీరం పేరు శ్రీకాంత్ కాదనుకుందాం. (కానీ నిజానికి, శ్రీకాంత్ అనే పేరుని ఈ వాచకం, ఈ వాచక శరీరం, ఈ శరీర వాచకం carry చేస్తున్నాయా? Does this text, does this body, does this textual body carry the name ‘Srikanth’? If so, what are the bearings of this name, this naming?) కొంతసేపు ఈ వాచకపు శరీరం పేరు అఫ్సర్ అని అనుకుందాం. అలాగే, ఇంకా కొంతసేపు, అఫ్సర్ అని మనచే/ఇతరులచే నామ్నీకరణం చేయబడ్డ ఆ శరీరపు నేనూ కవిత్వంరాస్తూ ఉంది అని అనుకుందాం, కవిత్వం’ ‘చాలా సౌకర్యవంతంగా దూసుకు వచ్చేముస్లిం వ్యక్తులతో నిండి ఉంది అని అనుకుందాం. Now, ఆ అతనిని, పైన అడిగిన ప్రశ్న/ప్రశ్నే అడుగుతారా? అడగగలుగుతారా? I doubt it. ఇది ఎందుకూ అంటే, నామం, నామ్నీకరణం ఇతరుని మనం అర్థం చేసుకునే ప్రక్రియని ఎంత వరకూ ప్రభావితం చేస్తాయో, నామం, నామ్నీకరణం అనేవి ఎలా మన presumed notions of understanding the Otherగా మారతాయో చెప్పడానికి మాత్రమే. అయినా, అదే aggressivenessతో మిమ్మల్ని మరొకటి కూడా అడుగుతాను: నేను’, ముస్లింని కాదని మీకు ఎలా తెలుసు? నేను హిందువునో, క్రిస్టియన్ నో, లేదా ముస్లింనో అవునో కాదోమీకు ఎలా తెలుసు? నేను ముస్లిం కాదని మీరు ఎలా, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? అన్నిటి కంటే ముందుగా, ఇతరున్ని అడగటం’, అడగటం అనే ఈ సంజ్ఞ, ఈ అడిగే సంజ్ఞ, ఈ రహస్యం (this asking, the act of this asking, the gesture of this asking, this asking gesture) ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ ఆధారంపై నిలబడి ఉన్నదో ఒకసారి ఆలోచించారా? ఎలా పంచుకుంటాం మనం దీనిని? ఈ సంజ్ఞని? ఈ రహస్యాన్ని? సౌకర్యవంతంగా రావడాన్ని?

ఇప్పుడు, కొంత సరళంగా ఇలా కూడా అడుగుతాను: నన్ను నిర్వచించేది ఎవరు? నేను ఏ మతానికి చెందినవాడినో (should one always belong to a religion, one religion? Should one always have a religion? What if one does not have one?) ఎలా ఉండాలో, ఉండకూడదో, నేనేం ధరించాలో ధరించకూడదో, నేనేం తినాలో తినకూదదో నిర్ణయించేది ఎవరు? అలా నిర్వచించే వాళ్ళుఎవరైనా ఉంటె, అలా నిర్వచించే వాచకాలు ఏవైనా ఉంటె, వాళ్ళకీ, వాటికీ, నన్ను నిర్వచించే, నిర్ణయించే అధికారం ఎవరు ఇచ్చారు? ఈ నిర్వచనాలూ, నిర్ణయాలూ వాడుకలోకి ఎలా వచ్చాయి?ఏ స్థానాలలో ఉన్నవారు, ఎటువంటి అధికారంలో ఉన్నవాళ్ళు వాటిని విరివిగా వాడుతున్నారీ? వాటిని దేనికై ఉపయోగిస్తున్నారు?మరొకరి ఈ నిర్ణయాలు’, నిర్వచనాలు, వచనాలు కాకుండా నేను మన్నలేనా? What if I do not participate, in your games of identity? What if I don’t participate in your games of religious identity as such? What if I do not subscribe to religious texts? నా ఉనికి ఏమిటో నిర్ణయించే ఆ వాచక/వచన/వర్తక మత సమూహాల ఆటలలో నేను పాలుపంచుకోలేదనుకోండి, ‘పవిత్రమత గ్రంధాలను నేను ఇతర వాచకాలగానే చూస్తాననుకోండి, అన్ని వాచకాలలాగానే అవి కూడా మానవ కార్యచరణాలుగానే చూసి, అన్ని మానవ వాచకాల లానే అవి కూడా వ్యాఖ్యానానికి అతీతం కావు అని నేను అన్నాను అనుకోండి (they are acts of human creation and hence are prone to interpretation), ఎలా నిర్వచిస్తారు మీరు నన్ను? ఈ శరీరాన్నీ? ఈ వాచాకాన్నీ?

ఇప్పుడు కొంత ఇలా కూడా చెబుతాను: ఏదైతే నీలో లేదో, ఏధైతో నీలో నివసించదో, ఏదైతే నీలో పలకదో, అది మాత్రమే బయటనుంచి లోపలికి రాగలదు. సౌకర్యవంతంగా నైనా, అసౌకర్యవంతంగానైనా. ఇక ఏదైతే నీలో ఉందో, ఏదైతే నీలోనే పలుకుతుందో, దానికి ఇక బయటనుంచి వచ్చే ఆస్కారం ఎక్కడ? అంటే, that which is not inside, that which does not reside inside , can come in. But, where is the scope to ‘come in’ for that which is always inside, for that which always recites inside, that which always resides inside, calling out your name to recognize itself? To recognize that the Other that is the self? ఇక రహస్యం గురించి ఇలా కూడా, ఇలా:

“How can another see into me, into my most secret self, without my being able to see in there myself? And without my being able to see him in me. And if my secret self, that which can be revealed only to the other, to the wholly other, to God if you wish, is a secret that I will never reflect on, that I will never know or experience or possess as my own, then what sense is there in saying that it is my secret, or in saying more generally that a secret belongs, that it is proper to or belongs to someone, or to some other who remains someone. It’s perhaps there that we find the secret of secrecy. Namely, that it is not a matter of knowing and that it is there for no one. A secret doesn’t belong, it can never be said to be at home or in its place. The question of the self: who am I not in the sense of who am I but rather who is this I that can say who? What is the- I and what becomes of responsibility once the identity of the I trembles in secret?”
— Jacques Derrida (The Gift of Death)

8. శ్రీకాంత్ కవిత్వంలో ఫలానా అని మీకు మీరుగా ఆలోచించుకుంటున్నప్పుడు ఆ శ్రీకాంత్ ఎవరు? అతన్ని గురించి మీరు ఆబ్జెక్టివ్ గా ఏం చెప్తారు?

A: At the risk of not being understood, at the risk of being misunderstood – as all reading is also a misreading- ముందుగా మీకొక చిన్న కథ చెబుతాను.
ఒక పదేళ్ళ క్రితం, నేను సంగీత థియేటర్ వద్ద, పక్కనే ఉన్న పాన్ షాప్ వద్ద నిలబడి, గోడకు ఆనుకుని సిగరెట్ త్రాగుతూ, నా తమ్ముడూ అతని స్నేహితురాలి కోసమూ టికెట్లు కొని ఎదురు చూస్తున్నాను. నేను నా లోకంలో మునిగి, ఆ వేసవి మధ్యాహ్నం, మరెవరినీ పట్టించుకోలేదు ఒక ప్రశ్న నన్ను ముందు నెమ్మదిగా, ఆ తరువాత ఘాడంగా తాకేదాకా. చాలా చిన్న ప్రశ్న. చాలా మామూలు ప్రశ్న: ఎక్కడుంటావ్ నువ్వు?” అని. తల తిప్పి చూస్తే నా పక్కగా, ఈ నగర రహదారుల్లో, పలు కూడలిలలో కనిపించే చిరిగిన కురుచ దుస్తులతో, పెరిగిన గడ్డంతో శిరోజాలతో, ఒక వింత నవ్వుతో ఒక ద్రిమ్మరీ లేదా పిచ్చివాడు’. అతను అడిగిన ప్రశ్నకి నేను వనస్థలిపురంఅని ఒక భౌగోళిక స్థానాన్నీ, నామాన్నీ చాలా యధాలాపంగా, అన్యమనస్కంగా ఉచ్చరిస్తే, తను క్షణకాలం నా వంక చూసి, “నువ్వు అక్కడ ఉంటావా? అని అడిగి, తిరిగి అదే మార్మికమైన నవ్వుతో, వేళ్ళ మధ్య వెలుగుతున్న పచ్చి ఆకుల బీడీ వంటి దానితో, ఆ రద్దీ వాహనాల ధాటిని ధాటి ఆవలి వైపుకు వెళ్ళిపోయాడు. నేను కొంత విస్మయంయ్యి, ఆ తరువాత కొంత తేరుకుని నన్ను నేనే తిరిగి ప్రశ్నించుకున్నాను: అవును, ఇంతకు నేను ఎక్కడ ఉంటాను? ఉండటం అంటే ఏమిటి? ఆంగ్లంలో రెండు పదాలు ఉన్నాయి: stay and live అని. మొదటిది బౌతికమైన స్థితిని చెబితే, రెండొవది మానసికమైన స్థితిని చెబుతుంది house and home లాగా. అతను నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అనా నన్ను అడిగినది లేక ఎక్కడ ఉంటాను నేను అనా? Where do you live అని ఎవరైనా అడిగితే సాధారణంగా మనం, మనం ఉండే ప్రదేశం చెబుతాం కానీ, నిజానికి అక్కడ ఉంటామా మనం? లేక మనదైన, మనకు మాత్రమే తెలిసిన మనలో ఉన్న కొన్ని రహస్య లోకాలలోనా? ఆ ఉండటం ఎక్కడ? చూడండి, Afsar stays in United States of America, Srikanth stays in India, someone else stays at some other place, but where do we live? What is that place? Where is that place? Do you find it outside? Is it merely a physical location? నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవుతుందా? Are you getting me? ఆ సరళమైన ప్రశ్న నన్ను కుదిపి వేసింది అత్యంత త్రీవతతో: నేను ఎక్కడ ఉంటానో తెలుసుకునేందుకు, ఆ కాలమూ లోకమూ ఏమిటో అవి ఎక్కడ ఉన్నాయో, ఆ గూడు ఎక్కడ ఉందో అని ఇప్పటికీ ప్రయతిస్తూనే ఉన్నాను, ఇప్పటికీ అక్కడకి చేరుకునేందుకు ప్రయాణం సాగిస్తూనే ఉన్నాను. Without exception we are all alike in such matters. Isn’t it?

మరి పైన చెప్పబడిన ఆ చిన్న ఆత్మకథా భాగం ఎందుకంటే, శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు కనుకా, శ్రీకాంత్ అంటూ ఎవరూ ఉండకూడదు కనుకా అని చెప్పటానికి. శ్రీకాంత్ కవిత్వంలో ఫలానాఅని నాకు నేను ఆలోచించుకుని, ఆ శ్రీకాంత్ ని జడ్జ్ చేసే లగ్జురీ(luxury) నాకు లేదు కనుకా. రాతలు/లిఖితాలు మన్నాలి, రచయితలు కాదు అని నేను విశ్వసిస్తాను కనుక. అపరమితమైన వేగంతో సాగే ఈ E-మీడియా లోకంలో, techno frenzy, -twittered-facebooked-bloggered కాలంలో, మనకి సరిపోయినంత megalomaniacs and egotists, రకరకాల రూపాలతో సాహిత్యాలలో, సమూహాలలో, సాహిత్య సమూహారాలలో ఉన్నారు కనుకా, మనం మన చూపుని రచయితల వైపు కాక వాచకాల వైపూ, వాటిలోని కోణాల వైపూ మరల్చుకోవాలి అని నేను నమ్ముతాను కనుకా . Let the gaze of our reading turn towards the dynamics of the text, towards reading, towards the heterogeneous act of reading and not towards the Subject in itself (which we know does not exist.).

9. మీరు సమూహాల్లో ఎక్కువగా కనిపించరు. మీదయిన వొక ఏకాంతాన్ని రచించుకుని అందులోనే వుంటారు అనిపిస్తుంది కొన్ని సార్లు? అవునా?

A: మీరు సమూహాలు అని దేనిని అంటారో లేదా దేనిని సూచిస్తున్నారో నాకు తెలియదు. ఒక వేళ మీరు సాహిత్య సమూహాలు అని సూచించినట్లయితే అది నిజం, ఎందుకంటే నాకున్న వ్యక్తిగతకారణాల వల్ల, ‘సాహిత్య సమూహాలపట్లా, ఆ సాహిత్య సమూహాలలో ప్రబలమయ్యే ధోరణుల పట్లా నాకు విముఖత ఉంది కనుకా. I somehow do not fit into those literary groups. Anyway leave it. కానీ సమూహాలు అనే పదాన్ని మీరు విస్తృతార్థంలో వాడినట్టయితే, నేను సమూహాలను చాలా ఇష్టపడతాను. Sycophancy లేని, లేదా sycophancy అతి తక్కువుగా కనిపించే, ముసుగులు అంతగా లేని, ముసుగులు తొలిగి ముఖాలు కనిపించే సమూహాలని నేను ఇష్టపడతాను. అక్కడ నేను కనిపిస్తాను. ఈ నగరం తీసుకోండిఎన్ని ప్రదేశాలు ఉన్నాయి అటువంటివి ఇక్కడలోకల్ బార్ల దగ్గరనుంచి, సుల్తాన్ బజార్ల నుంచి ఓల్డ్ సిటీ వీధుల నుంచీ, తేనీటి ప్రదేశాల నుంచీ, నేను ప్రీతిపాత్రంగా తినే బీఫ్ హోటళ్ళ నుంచీ, ఎన్ని ప్రదేశాలు, ఎన్నెని ప్రదేశాలు ఉన్నాయి అటువంటివిఅటువంటి ప్రదేశాలలో, అటువంటి సమూహాలు తిరుగాడే పగళ్ళలో, రాత్రుళ్ళలో, సాయంసంధ్యలలో నేను కనిపిస్తాను. నిజానికి నేను అక్కడే కనిపిస్తాను. ఇక ఒక ఏకాంతాన్ని (ఏకాంతం, ఏక కాంతం, ఏ కాంతం?, ఏక అంతం, ఇలా పలు విధాలగా కూడా చదుకుంటాను కాసేపు ఆ పదాన్ని) రచించుకుని, అందులోనే ఉండటంఅనేది నాకు తెలియదు. నాకు మటుకు నేను ఏ(ఒక)కాంతనీ, ఏ ఒక ఏకాంతాన్నీ ర/చించుకుని, రచిస్తూ అందులోనే ఉండననే అనుకుంటున్నాను. I am easily available to anyone who wants to meet me అని కూడా అనుకుంటున్నాను.

10. దిగులు పలికినంత తేలికగా మీకు సంతోషం పలకదు. అది బలహీనతా? బలమా?

A: ఆంధ్రేయ్ తర్కోవిస్కీ, – నేను అమితంగా ఇష్టపడే- రష్యన్ ఫిల్మ్మేకర్, ఎక్కడో ఇటువంటి ప్రశ్నకే జవాబు ఇస్తూ ఇలా అంటాడు: జీవితంలో సంతోషంగా ఉండటం కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయిఅని. కాస్త సరదాగా చెప్పాలంటే, నేను సంతోషం పట్ల సంతోషంగా లేను. ఇంకా ఇలా కూడా చెప్పవచ్చు: సంతోషం అని మీరు అడుగుతున్నప్పుడు, what do you mean by that? Do we all share the same happiness? A similar meaning of happiness? సరే, అలా కాకుండా ఇల్లా కూడా చెప్పుకుందాం: ఏదైతే వాచకాలలో, ప్రజలలో, లోకంలో (majorityగా) సంతోషంగా నిర్వచించబడిందో, అది నాకు తెలియదు. అది లేదా అటువంటివి నాకు సంతోషాన్ని ఇవ్వవు. అవి నాకు సంతోషం కాదు. నా మటుకు, అటువంటి సంతోషం ఎదిఅతే ఉందో, it lacks depth. It lacks intensity. Let us not confuse laughter, that laughter with good conscience – as Nietzsche would say- with happiness. ‘భారమైన’, ‘మోయలేనిసవాలక్ష విలువలని వెక్కిరిస్తూ, స్ఖలించినంత హాయిగా, తేలికగా, స్వేచ్చగా, నిర్మొహమాటంగా ఇవ్వబడిన వాటిని subvert చేస్తూ నవ్వే నవ్వు ఉంటుంది కదా, అది నాకు ఇష్టం. ణేనే ణేనేఅని నన్ను నేను వెక్కిరించుకుంటూ, ఇతరులని వెక్కిరించే నవ్వు: అది ఇష్టం. కానీ దానిని ఎవరు గుర్తిస్తారు? In a world that takes itself too seriously, in fact, unbearably too seriously, who would recognize such a laughter? Yes, sometimes women have such laughter. Mocking laughter. వెక్కిరింతతతో కూడిన నవ్వు. వెక్కిరించే నవ్వు. మన కుహానా ప్రతిరూపాల నిర్మాణాలనీ, మన ఏకస్వర పురుష వాచకాలనీ వెక్కిరించే నవ్వు. అటువంటి నవ్వు, నిర్మాణాల డొల్లతనాన్ని అర్థం చేసుకుని, అటువంటి నిర్మాణాలు దిద్దిన ఈ లోకాన్ని చూసి ఒక మహా దిగులుతో, మన ముఖాల మీద నవ్వే నవ్వు. I prefer that. ఇక బలమా లేక బలహీనతా అనేది యుద్ధభూమిలో ఉన్నవాడికి, వాచక కేద్రంలో ఉన్నవాళ్ళకీ వేయవలసిన ప్రశ్న. వాచకాల అంచులలో తిరిగే నాలాంటి వాడికి, అంచులు లేనిదే కేంద్రం లేదు అని చెప్పే, నవ్వే నాలాంటి వాడికి, అంచులే కేంద్రాన్ని నిర్ధేశిస్తాయి అని కూడా అనే నాలాంటి వాడికి ఆ ప్రశ్నలతో ఏం సంబంధం? అందుకే ఇలా కూడా చెబుతూ ఒక ‘disclaimer’తో, మరో రెండు quotesతో ఇట్లా ముగిస్తాను’:

Please – seriously – do not take me seriously. నన్ను ఉన్నది ఉన్నట్లుగానే, యధాతధంగానే తీసుకోండి. All that which you have read could be the truth. Autobiographical truth. Or the truth in autobiography. Of autobiography. Don’t you know that all poets tell the truth, in truth, except the truth?

I don’t feel it is necessary to know who I am. The main interest in life and work is to become someone else that you were not in the beginning. If you knew when you began a book what you would say in the end, do you think you would have the courage to write it? What is true for writing and for a love relationship is true also for life. The game is worthwhile insofar as we don’t know what will be the end- Michel Foucault.

నేను అడిగాను: కవిత్వం అంటే ఏమిటి?అని. అతను చెప్పాడు: తప్పు ప్రశ్న. నువ్వు అడగాల్సింది ఏమిటంటే, కొన్ని వాచకాలు ఎలా కవిత్వంగా మారతాయీ అని. ఇక నేను అడిగాను: కొన్ని వాచకాలు ఎందుకు కవిత్వం అవుతాయి? అతను అన్నాడు: ఎందుకుఅని కాదు, ‘ఎలాకొన్ని వాచకాలు చరిత్రలో కొన్ని సమయాలలో కవిత్వంగా చలామణి అవుతాయనీ, కవిత్వంగా మారతాయనీ. దానికి నేను అన్నానూ: మరి నేను కవిని కాదు, నువ్వో?

అప్పుడు ఒక నిట్టూర్పుతో తను ఇలా, తను ఇలాగే అడిగింది:



How to write one who has none, how to write none who has everyone? అది ఎవరో మీకేమైనా తెలుసా?
......................................................................
ప్రశ్నలు అఫ్సర్ వి. జవాబులు...???!!!
Published in Vaakili.com/22.02.2013 & 01.03.2013