_________________________________
నిన్ను నువ్వు స్వప్నిస్తూ నన్ను కలగంటావు
మృత్యువుకై సాగిపోతూ
నా అరచేతుల మధ్య క్షణకాలం ఆగి విశ్రమించే
మృత్యువుకై సాగిపోతూ
నా అరచేతుల మధ్య క్షణకాలం ఆగి విశ్రమించే
నీ చేతికి శతాబ్దాల అలసట తెలుసు
ఆ క్షణిక సమయంలోనే,
నువ్వు కూడా స్వప్నిస్తావు: నీరెండలో, నీటిలో
రెక్కలు విదిల్చే ఒక కాంతి పక్షిని -
నువ్వు కూడా ఒక బుజ్జి నెత్తురు పిట్ఠవి!
రాత్రి తర్వాత రాత్రి
ఒక ప్రమిదెకై తపిస్తూ, నిన్ను నువ్వు స్వప్నిస్తూ
నన్ను కలగంటావు!
No comments:
Post a Comment