26 April 2018

|| my constipation girl ||

dear little lady
you see
don't you worry
It's something like this
you need to take
more water
perhaps, you need
to increase
your fiber intake
you see
more than anything else
you should stop
worrying about everything
of every
tom 'dick' and harry
I mean
your ex -boyfriends
your guilt
and your dog
(not me!
though of course
I like
licking you as well )
more importantly
my lady
managing stress
will manage
your gut -brain axis
( so they say )
so my lady
don't you worry
constipation
has turned people
to philosophers
spiritualists
& truth seekers!
( though
I am not one
among
them )
So, be pleased
so don't you worry
so, it so happens that
I love you
with all your farts
with your menses
with your shit
with your lice
and every other thing
that you are
scared to speak of;
and finally
dear little lady
you see
don't you worry
who knows
perhaps we are all
farts of God
and
this creation
is but a rumbling
in the
womb of
a Goddess
defecating
across the universe!

25 April 2018

|| కర్టైన్స్ ||

బహుశా ఎవరూ రారు; ఈ పాతఫాను ఒక్కటే, తిరుగుతో; అలసిన శబ్దం దాని రెక్కల్లో, వేడిమి; పొయ్యి ఆరిపోయాక మిగిలే బొగ్గు కణికెల్లాంటి చీకటి; ఆరినా ఇంకా కాలిపోతో, బయట, బాల్కనీలో గులాబీ మొక్క పగిలిన పెదాలైన ఆకులతో వడలే ఉండవచ్చు, నీళ్ళు లేక మట్టిముంత వద్ద ఎంతో తచ్చాట్లాడి, మరి పిట్టలు ఎగిరిపోయే ఉండవచ్చు ఆకాశం ఎండిన సరస్సై , పగుళ్లిచ్చి అట్లా నోరు చాచి, ఓ శిశువై గుక్కపట్టే ఉండవచ్చు! *** రూఢీగా ఎవ్వరూ రారు; ఇక, కర్టెన్లే ఈ వొంటరి గదిలో,
రెక్కలు తెగిన సీతాకోకచిలుకలై

కొట్టుకులాడీఆడీఆడీ, ఆగిపోయి!

23 April 2018

|| కాలం ||

వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
ఆ మెట్లన్నీ దిగి
ఆయాసంతో రొప్పుతో అమ్మ,

అగ్నికీలలవలే ఎండ; గాజుపెంకులు
రాలినట్టు మరి
దారంతా మెరుస్తో, కోసుకుపోతో -

గేటు పక్కగా పెరిగిన వేపచెట్టు; ఎన్నో
ఆకుల్ని రాల్చి,
తనలో తానే వొదిగీ వొంగీ ఇక

ముడతలు పడి; పక్షులు కూడా లేవు
ఇప్పుడు. అన్నీ
ఖాళీ అయిన గూళ్ళూ , ఎండిన

కొమ్మలూ; ఎప్పుడైనా గాలి వీస్తే రాలే
సన్నటి దుమ్మూ,
రాత్రుళ్ళు ఏర్పడే వొంటరి తేమా!
***
వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
ఇక పంటి బిగువున
తనని తాను ఆపుకుని, తలని

తిప్పుకున్న అమ్మ కళ్ళలో, కంపిస్తో
పగిలిపోయే నీటి
బుడగలు; గుక్కపట్టే శిశువులు!

08 April 2018

మరి


మరి, ఎంతో ఘాడంగా కమ్ముకునే
ఉన్నాయి మబ్బులు,
పొరలు పొరలుగా వీచే గాలి,

ఉన్నట్టుండీ ఉరిమే సవ్వడి; మరి
ఈ మసక కాంతిలో
చెమ్మగిల్లిన ఈ వెలుతురులో ...

చినుకులు రాలే చప్పుడేనా అది?
ఆకులు వణికి, పూలు
ఇక, తలలు వాల్చే కాలమేనా,

ఇది? సాగలేక ఇక ఏ చెట్టు కిందో
చేరి, వొరిగి, కళ్ళు
చికిలించి చూస్తో, ఇక ఎవరినో

తలుస్తో, కనులు మూయవలసిన
క్షణం ఆసన్నమైన,
మలి దశా, లోకమిదేనా మరి?
***
మరి, ఎంతో ఘాడంగా కమ్ముకునే
ఉన్నాయి మబ్బులు;
వాన కురవకనేలోపలంతా

ఆకులు రాలి, తడచిపోయీ!