చీకట్లో మెరిసే పూలను చూపిద్దామనీ
వాటిలో కమ్ముకున్న మబ్బులనీ
కురిసే తుంపరనీ, వీచే గాలినీ, ఖాళీనీ
నీకు ఇద్దామనీ వచ్చాను నేను. కానీ
అప్పటికే నిద్రపోయి ఉన్నావు నువ్వు -
పగిలిన పలకవై, బలపమై, చీకట్లోని
ఖాళీవై, నేల వాలిన గాలివై ఒక
మబ్బువై, ఎంతో అలసిన అమ్మవై!
వాటిలో కమ్ముకున్న మబ్బులనీ
కురిసే తుంపరనీ, వీచే గాలినీ, ఖాళీనీ
నీకు ఇద్దామనీ వచ్చాను నేను. కానీ
అప్పటికే నిద్రపోయి ఉన్నావు నువ్వు -
పగిలిన పలకవై, బలపమై, చీకట్లోని
ఖాళీవై, నేల వాలిన గాలివై ఒక
మబ్బువై, ఎంతో అలసిన అమ్మవై!
No comments:
Post a Comment