13 October 2016

అలజడి

మునిమాపు వేళలోకి రాలిన నీ శిరస్సు
ఒక పొద్దుతిరుగుడు పూవు -
చిట్లిన సవ్వడి  చేసే సన్నటి రాత్రి
కొమ్మలు నీ చేతులైతే మరి

నీడలతో వొణికే నీటి చెలమలేమో
నీ కళ్ళు: (అనాధల మల్లే) -
ఇక, ఏదో చెప్పాలని కష్టంగా నువ్వు
నాలికతో నీ పగిలిన పెదాలని

తడుపుకుంటే, ఇష్టంగా రాసుకున్న
పలకని ఎవరో తుడిపివేసినట్టు
నీలో ఒక నిశ్శబ్ధం: ఎంతో నొప్పి -
లోపల ఎక్కడో, స్మశానంలో

నేలను తాకి ఆకు చేసే అలజడి!  

1 comment:

  1. నేలను తాకే ఆకు చేసే అలజడి! extraordinary feel

    ReplyDelete