రాత్రి. నేలంతా తడిచి, గాలంతా
తడిచి, ఒక పరిమళం -
గాలి నీ చుట్టూ ఓ సీతాకోకచిలుకై
ఎంతో తేలికగా ఎగిరే శబ్ధం -
ఆకులూ, పల్చటి కాంతిలో ఊగే
లతలూ, నీడలూ, గూళ్ళల్లో
ఒదిగిన పిట్టలూ ఇక నీ లోపల -
***
అన్నం ఉడుకుతోంది, ఈ రాత్రై
ఒక పాత్రై, తాను వేలితో
చిదిమి చూసే ఒక మెతుకై!
తడిచి, ఒక పరిమళం -
గాలి నీ చుట్టూ ఓ సీతాకోకచిలుకై
ఎంతో తేలికగా ఎగిరే శబ్ధం -
ఆకులూ, పల్చటి కాంతిలో ఊగే
లతలూ, నీడలూ, గూళ్ళల్లో
ఒదిగిన పిట్టలూ ఇక నీ లోపల -
***
అన్నం ఉడుకుతోంది, ఈ రాత్రై
ఒక పాత్రై, తాను వేలితో
చిదిమి చూసే ఒక మెతుకై!
No comments:
Post a Comment