09 August 2015

అపార్ధం

"ఈ ప్రపంచం
ఒక పూవైతే, ఒక సీతాకోకచిలుకైతే, వాన కురిసే ఒక చల్లని కాలమైతే
ఎంత బావుండును" అని తను అన్నది -

వెనువెంటనే అతను
వానలో ఊగే ఒక పూవుని తెంపీ, గాలిలో కాంతిలో - తనని తాను మరచి -
ఎగిరే ఒక సీతాకోకచిలుక రెక్కలని, విరిచి పట్టుకునీ
ఇచ్చాడు తనకి ప్రేమతో, ఒక బహుమతిగా -

ఇక
తల్లడిల్లే హృదయంతో
వడలిన పూరేకులనూ, నలిగిపోయిన రెక్కలనూ వొణికే వేళ్ళతో తాకుతూ
అన్నది తను అశ్రువులతో
బీటలు వారిన గొంతుకతో -

"ఎన్నటికి అర్ధం చేసుకుంటావు నువ్వు?
నన్ను?"

1 comment:

  1. ఎన్నటికి అర్థం చేసుకుంటావు నువ్వు నన్ను? ఆ ప్రశ్న అడగటం లో ఎంత బాధ?మనసుని తాకింది చాలా బాగా రాశారు.

    ReplyDelete