చీకటిలో నీ కన్ను గుండ్రటి పాలరాయలా మెరుస్తోంది.
కొంత కోరికా కొంత బాధా, కొంత నిస్సహాయతా ఉన్నాయి దానిలో.
అలసిపోయింది అది. కమిలిపోయింది అది -
కొంత నిదురా, కొంత స్పర్శా, కొంత ప్రేమా
కొంత శాంతీ కావాలి దానికి. దా -నా కంటిని కౌగలించుకో.
దానికి కొంత రాతి బాష తెలుసు.
ఇక రేపు ఉదయం మనం కన్నీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు.

No comments:
Post a Comment