ఎవరూ లేని నా గదిలో - వొంటరిగా - చెట్టు లేని ఒక ఆకు.
నిన్నటి వరకూ అది ఒక ఆకాశం, వర్షం, జీవంతో తొణికిసలాడే భూమీ.
నిన్నటి వరకూ అది ఒక పాప, నవ్వులతో విరగబూసే ఒక స్త్రీ
పిల్లల్ని భుజాలపై ఎక్కించుకుని ఆటలాడే ఒక తండ్రీ -
అయితే, ఒక సాయంకాలపు రాత్రి అది అనాధగా మారింది.
గూటినుంచి తరిమి వేయబడగా దారి తప్పిన పిట్టలా మారింది. మరణానికి చేరువై,
బయట వీచే గాలిని తాకలేక పాలిపోయింది. కమిలిపోయింది -
ఏమీ లేదు
హీనులు, అకారణంగా ఒక చెట్టుని కొట్టివేసారు. మరో ఆకు
ఎవరూ లేని నా గదిలో ఈ పూట పూర్తిగా శిధిలమయింది.

No comments:
Post a Comment