నీ నుదుటిన
ఒక వాన చినుకు. చిగురాకంత గాలి అప్పుడు నీలో: గూళ్ళల్లో సర్దుకుని
బెదురుగా ఎదురుచూసే పిచ్చుకలు నీ కళ్ళు. కంపించే
ఒక సాయంత్రం, మబ్బులు గుమికూడిన ఆకాశం
మసక చీకటీ, ఎవరిదో ఒక అశ్రువు చితికిన కాటుకై -
ఎవరిదో మరి అప్పుడు
నిను తాకే - పురాజన్మల సువాసన. ఎవరివో మరి అప్పుడు, నిన్ను రహస్యంగా హత్తుకునే
బాహువులు. ఎవరివో మరి అప్పుడు, చిన్నటి మాటలు: ఎవరివో మరి అప్పుడు
నిన్ను స్మరించే పెదాలు -
మరి ఎవరిదో
ఒక ముఖం
అప్పుడే, వెనుక నుంచి నిన్ను అతి మృదువుగా పిలిచినట్టూ
సన్నటి నవ్వుతో అప్పుడే
ఎవరో నీ మెడను దాదాపుగా తాకినట్టూ, ఎవరివో పెదాలు
అప్పుడే, నిన్ను ఆనీ ఆననట్టూ, అప్పుడే ఎవరిదో ఒక శ్వాస నిను తాకీ తాకినట్టూ
నీలో - ఒక గగుర్పాటు. ఒక అలికిడి. తల తిప్పి చూసేలోపల
అక్కడ ఎవరూ లేక
నీలో కలిగే
ఒక గుబులు. ఒక తపన. నీ శరీరమంతా, నీ లోపలా, జీవన్మరణ సీమల్లోని మహాశూన్యం-
నీ నుదిటిన
జ్వలిస్తో దిగబడే
ఒక స్మృతి ముద్రిక. శిలువ వేయబడే ఒక దైనందిన చర్య. ప్రేమ . ఇక
అక్కడే చివరిగా
వాన వెలసిన నిశ్శబ్ధంలో
ఎవరిదో ఒక రాత్రి నిద్రలో, నువ్వు నెమ్మదిగా సద్దుమణిగే వేళల్లో పుష్పించే
నీలో మిగిలే, చినుకంత
శ్వేత స్వప్నచ్ఛాయ -

chala bagumdi
ReplyDelete