అతను అన్నాడు -
"నేనొకసారి తనని ముద్దాడాను. అప్పటినుంచీ నేను
నా చూపును కోల్పోయాను. నా చూపులకు దూరంగా తననీ కోల్పోయాను"
తను అన్నది -
"నేనొకసారి ప్రేమించాను
అప్పటినుంచీ నేను శిధిలాలలో జీవిస్తున్నాను.
అప్పటినుంచీ శరణార్ధినై నేను, నావి కాని ప్రదేశాలలో తిరుగాడుతున్నాను"
ఎవరో ఇలా కూడా అన్నారు -
"More than one, more into one
Is none"
ఆ తరువాత ఆ రాత్రంతా ఆ ముగ్గురు
ఒకరి చీకట్లో మరొకరు తల దాచుకుని
రూపాలూ రంగులూ మారే చందమామను చూస్తూ గడిపారు. ఇక తెల్లవారేసరికి
అక్కడ మిగిలింది ఎవరో, వాళ్ళ లోపల నుంచి వెళ్ళిపోయింది ఎవరో
ఎవరికీ తెలియలేదు!

No comments:
Post a Comment