మాట్లాడవు నువ్వు: ఒక తలారి మౌనం
నీ కళ్ళల్లో -
***
పొగమంచు అలుముకునే వెన్నెల
రాత్రుళ్ళూ,
ఘనీభవించిన
సరస్సులూ,
నీడల్లో
వేలాడే ఖాళీ
గూళ్ళూ,
మరి
ఎక్కడినుంచో
తేలివచ్చే ఒక ఆర్తనాదం అతనిలో -
***
మాట్లాడవు నువ్వు: ఒక హంతకుని
నైపుణ్యం నీ మౌనంలో -
***
ఇక రాత్రంతా కురిసిన వాననీటిలో
డగ్గుత్తిక స్వరంతో అతని దేహం
ఏటో కొట్టుకుపోయింది -
No comments:
Post a Comment