-అన్నా, నమస్తే-
......
-ఏమే, ఈ మధ్యన కనిపిస్తల్లేవ్?-
......
-సాయంత్రమేంజేస్తున్నావ్? కలుద్దామా?-
-ఈ మధ్యన త్రాగడం లేదు-
-ఏ... ఊరుకో అన్నా. మజాక్ జేస్తున్నావా ఏంది? ఏమైయ్యిందే?-
-ఏం లేదు. కొంతకాలం మానేద్దాం అనుకున్నా-
-అవునా? మరి మానేసి ఏం చేద్దామనే?-
-ఏం లేదు. ఈ మధ్య యోగాలో చేరాను...
-అవ్నా? ఇంకేం జేస్తున్నవే? ఎక్కడ కనిపిస్తల్లేవ్? ఏం రాస్తల్లేవ్?-
-రాయడం మానేసాను -
-ఎందుకే? ఏం చదవడం కూడా లేదా?-
-చదువుతున్నా. మళ్ళా రజనీష్నీ, ఇంకా...
-నువ్వు సైకోగాడని పిల్సుతుండే... గాడ్నా?!
-ఆ... రజనీష్నీ, జిడ్డు కృష్ణమూర్తినీ, రమణ మహర్షినీ, నిసర్గదత్తనీ
ఇంకా టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ లాంటివి మళ్ళా చదూతున్నా-
రేపెప్పుడన్నా ఏదన్నా మెడిటేషన్ సెంటర్లో చేరుదామని కూడా
అనుకుంటున్నా-
-గిదేందే?-
-ఏమో?-
-ఎన్ని రోజోలసంది తాగడంలే? ఊర్కో అన్నా. దా... కాసేపు గూర్చుందాం...
-నిన్నటి నుంచే మానేసాను.
నాన్ వెజ్ కూడా. యోగా చేరి పది రోజులవుతుంది. వాకింగ్కీ, జిమ్కీ వెళ్తున్నా
డైట్ మార్చాను. మొలకలు లాంటివీ, ఇంకా
బాయిల్డ్ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నా-
-నీకేదో అయ్యిందన్నా. ఇప్పుడేడకి?-
-అమ్మను చూసి రెండు వారాలయ్యింది. ఒకసారి చూసొద్దాం అని వెళ్తున్నా-
-అవ్నా ...
-నా సంగతి సరే కానీ, నువ్వేం చేస్తున్నావ్?-
-ఇగో ఏమనుకోకు కానీ
నీలాంటోల్లకి దూరంగా ఉండాలని ఇప్పుడే అనుకుంటున్నా-
.......
- సరే అన్నా - ఉంటా. మల్ల కలుస్తా.
అన్నా... నమస్తే -

:)
ReplyDelete:)
ReplyDelete