ఆ రెండు అరచేతులలోకి, నీ అరచేతులని వొదిలివేసి
అలా కూర్చుంటావు నువ్వు-
శీతాకాలపు సాయంత్రం.
శరీరంలో గుబులు చెట్లేవో వీచి, కలకలంతో పక్షులు
ఒక్కసారిగా గుంపుగా లేచి, తిరిగి సర్ధుకునే
ఒక జ్ఞాపకం. ఇక నెమ్మదిగా తల ఎత్తి తను
నీవైపు చూసిందో లేక ఆ కళ్ళలో కనిపించే నీటి తెరలను
నువ్వే సాయంత్రంగా భ్రమించావో, లేక
ఆ నీటి తెరలపై, అలసిన నీ అరచేతులను
కాగితపు పడవల వలే వొదిలివేసావో, లేక
తనకు చెప్పాలనుకుని రాసుకున్న ప్రేమ
లేఖలన్నిటినీ చెప్పలేక చించివేసావో, ఒక
నిట్టూర్పుతో వొదిలి వేసావో, మూగవాడివి
ఎందుకు అయ్యావో, నీకూ తెలియదు. తనకూ తెలియదు.
ఇక - తల ఎత్తి ముఖం వైపు చూసేలోపు, చప్పున
ముఖం తిప్పుకున్నదీ, గుండెను ఉగ్గపట్టుకున్నదీ
ఎవరో కూడా తెలియదు-
ఇక చివరకు మిగిలేదల్లా
ఒక శీతాకాలపు సాయంత్రం: ఖాళీ గూళ్ళు. నీడలు -
సన్నగా వొణికే చలి రాత్రీ, ఒంటరి చీకటీ
అరచేతుల్లోంచి అరచేతులు తొలిగిపోయి
నెమ్మదిగా దీపాలను ఆర్పి, తమలోకి తాము
ముడుచుకుపోయే మన చేతివేళ్లూ
ఈ కాలం, లోకం, చీకటిని చీలుస్తూ
గదిలోంచి వెళ్ళిపోయే - నీదో, నాదో -
మరి ఒక దేహ దీప ధూపం!

'తల ఎత్తి తను
ReplyDeleteనీవైపు చూసిందో లేక ఆ కళ్ళలో కనిపించే నీటి తెరలను
నువ్వే సాయంత్రంగా భ్రమించావో'
మూగవాడివి
ReplyDeleteఎందుకు అయ్యావో, నీకూ తెలియదు. తనకూ తెలియదు